ఎమ్మెల్సీ కవితకు స్పీకర్ పోచారం శుభాకాంక్షలు

అత్యధిక మెజారిటీతో గెలుపొందిన కల్వకుంట్ల కవిత శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డిని సోమవారం సాయంత్రం ఆయన అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఎమ్మెల్సీ కవితకు స్పీకర్ పోచారం శుభాకాంక్షలు

Edited By:

Updated on: Oct 12, 2020 | 9:54 PM

ఇందూరు గడ్డ పై కల్వకుంట్ల. కవిత విజయఢంకా మోగించింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో రికార్డు స్థాయి లో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన కల్వకుంట్ల కవిత శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డిని సోమవారం సాయంత్రం ఆయన అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్పీకర్‌ పోచారం శ్రీనివాస‌రెడ్డి ఆమెకు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. కవిత వెంట జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ తోపాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు నేతలు ఉన్నారు.