పౌరవిమానయాన శాఖ వెబ్‌సైట్‌ క్రాష్‌!

| Edited By:

May 06, 2020 | 7:50 PM

Civil Aviation Website: కోవిద్-19 విజృంభిస్తోంది. దీని కట్టడికోసం తెలంగాణాలో లాక్ డౌన్ మే 29 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. కరోనావైరస్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా పౌరవిమానయాన శాఖ వెబ్‌సైట్‌కు భారీ రద్దీ పెరిగింది. విమానాల సమాచారం కోసం విదేశాల్లో ఉన్న వారు ఈ వెబ్‌సైట్‌ను సందర్శించారు. కాగా.. ఒక్కసారిగా రద్దీ పెరిగి వైబ్‌సైట్‌ […]

పౌరవిమానయాన శాఖ వెబ్‌సైట్‌ క్రాష్‌!
Follow us on

Civil Aviation Website: కోవిద్-19 విజృంభిస్తోంది. దీని కట్టడికోసం తెలంగాణాలో లాక్ డౌన్ మే 29 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. కరోనావైరస్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా పౌరవిమానయాన శాఖ వెబ్‌సైట్‌కు భారీ రద్దీ పెరిగింది. విమానాల సమాచారం కోసం విదేశాల్లో ఉన్న వారు ఈ వెబ్‌సైట్‌ను సందర్శించారు.

కాగా.. ఒక్కసారిగా రద్దీ పెరిగి వైబ్‌సైట్‌ క్రాష్‌ అయినట్లు అధికారులు ప్రకటించారు. వెబ్‌సైట్‌ను పునరుద్ధరించేందుకు ఎన్‌ఐసీ విభాగం పనిచేస్తోందని విమానయాన మంత్రిత్వ శాఖ ట్విటర్‌లో ప్రకటించింది. విదేశాల నుంచి భారతీయులను తరలించేందుకు ఏర్పాటు చేసిన విమాన వివరాలను ప్రస్తుతం ఎయిర్‌ ఇండియా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. విదేశాల్లో ఉన్న దాదాపు 15వేల మందిని తరలించేందుకు భారత ప్రభుత్వం 64విమానాలు సిద్ధం చేసింది.

[svt-event date=”06/05/2020,7:28PM” class=”svt-cd-green” ]