రాష్ట్రంలో పాఠశాలలు తెరిచేందుకు మరింత సమయంః సబితా

ఈ ఏడాది విద్యాసంస్థ‌లు తెరిచేందుకు మ‌రికొంత స‌మ‌యం ప‌ట్టే అవకాశముందన్నారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కేంద్ర ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల మేర‌కు పాఠ‌శాల‌లు తెరుస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

రాష్ట్రంలో పాఠశాలలు తెరిచేందుకు మరింత సమయంః సబితా

Updated on: Sep 15, 2020 | 12:37 PM

ఈ ఏడాది విద్యాసంస్థ‌లు తెరిచేందుకు మ‌రికొంత స‌మ‌యం ప‌ట్టే అవకాశముందన్నారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కేంద్ర ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల మేర‌కు పాఠ‌శాల‌లు తెరుస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. విద్యా సంవ‌త్స‌రం న‌ష్ట‌పోకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ చొరవతో ఆన్‌లైన్ క్లాసులకు రూప‌క‌ల్ప‌న చేశామ‌న్నారు. పాఠ‌శాల‌ల ప్రారంభం, ఆన్‌లైన్ క్లాసుల నిర్వ‌హ‌ణ‌పై శాసన మండ‌లిలో స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి సబితా స‌మాధానం ఇచ్చారు.

క‌రోనా ప్ర‌భావంతో విద్యా సంస్థలు మూతపడ్డాయి. విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా మార్చి 16 నుంచి పాఠ‌శాల‌ల‌ను మూసివేయ‌డం జ‌రిగిందని మంత్రి స‌బితా తెలిపారు.. లాక్‌డౌన్ స‌మ‌యంలో ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై ఆందోళ‌న నెల‌కొన్న నేపథ్యంలో.. సీఎం చొర‌వ తీసుకుని అన్ని త‌ర‌గ‌తుల విద్యార్థుల‌ను పై త‌ర‌గ‌తుల‌కు ప్ర‌మోట్ చేశామ‌న్నారు. ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులంద‌రినీ పరీక్ష రాయకుండానే పాస్ చేశామ‌న్నారు. విద్యా సంస్థ‌లు తెరిచేందుకు మ‌రికొంత స‌మ‌యం ప‌ట్ట‌వచ్చన్న ఆమె.. విద్యా సంవ‌త్స‌రం న‌ష్ట‌పోకుండా ఉండేందుకు ఆన్‌లైన్ క్లాసులకు రూప‌క‌ల్ప‌న చేశామ‌న్నారు. విద్యార్థులంద‌రికీ ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేశామ‌ని తెలిపారు.

ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణపై ముందస్తుగా విద్యాశాఖ త‌ర‌పున మూడు ర‌కాల స‌ర్వే చేశామ‌ని చెప్పారు. రాష్ర్టంలో 85 శాతం మంది విద్యార్థులకు టీవీ అందుబాటులో ఉన్నట్లు తేలిందన్న సబితా.. 40 శాతం విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు కూడా ఉన్నట్లు గుర్తించామన్నారు. టీవీ, స్మార్ట్ ఫోన్లు లేని వారిని ప‌క్క‌వారితో అనుసంధానం చేశామ‌ని తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ ప్రసార మాధ్యమాలైన దూర‌ద‌ర్శ‌న్‌, టీ శాట్ యాప్‌లో డిజిట‌ల్ క్లాసులు అందుబాటులో ఉంచామ‌న్నారు. విద్యార్థుల ఫీడ్ బ్యాక్ కోసం వ‌ర్క్ షీట్స్ త‌యారు చేశామ‌ని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం విద్యార్థులందరికీ ఆన్‌లైన్ క్లాసులు సౌకర్యవంతంగా ఉందని మంత్రి తెలిపారు. ఇక, అత్య‌ధిక ఫీజులు వ‌సూలు చేస్తున్న ప్రైవేట్ స్కూళ్లపై కఠినచర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ గ‌ట్టిగా చెప్పారన్నారని మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి స్ప‌ష్టం చేశారు.