హైదరాబాద్ నగరంలో రోడ్లపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరంలో గల రోడ్లు, నెట్‌వర్క్‌లను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు కేటీఆర్. విపరీతంగా పెరిగిపోయిన ట్రాఫిక్‌పై దృష్టి సారించాలని, రానున్న రోజుల్లో రద్దీ తగ్గించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఎక్కడిక్కడకే రద్దీ పెరిగిన దృష్ట్యా ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సాధ్యమైనంత వరకు స్లిప్ రోడ్లు వేయాలని సూచించారు. ప్రగతిభవన్‌లో శనివారం జరిగిన ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్ శాఖ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ మేయర్ లోకేశ్‌కుమార్ పాల్గొన్నారు.