పేదలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..

|

Aug 29, 2020 | 2:02 AM

తెలంగాణ సర్కార్ పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ పరిధిలో మరో 100 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఅర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

పేదలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..
Follow us on

Basthi Dawakhanas: తెలంగాణ సర్కార్ పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ పరిధిలో మరో 100 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఅర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నగరంలో ప్రస్తుతం ఉన్న 197 బస్తీ దవాఖానాల ద్వారా ప్రతీ రోజు 25 వేల మందికి పైగా ప్రాధమిక వైద్య సేవలు అందుతున్నాయని.. ప్రజారోగ్యాన్ని కాపాడటంలో ఇవి విజయవంతమయ్యాయని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. (కరోనా చికిత్స.. ఆ రెండు టాబ్లెట్స్ కలిపి వాడితే ముప్పే..!)

శుక్రవారం బస్తీ దవాఖానాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బస్తీ దవాఖానాలు హైదరాబాద్ పరిధిలో విజయవంతంగా కొనసాగుతున్నాయని అన్నారు. ఈ సేవల పట్ల పేదలు సంతృప్తిగా ఉన్నారని.. వచ్చే 2-3 నెలల్లో మరో వంద దవాఖానాలు ప్రారంభించాలని అధికారులకు మంత్రి కేటీఅర్ తెలిపారు.