కాబోయే న్యూజిలాండ్‌ మంత్రికి కేటీఆర్ అభినందనలు

Minister KTR Congratulates : న్యూజిలాండ్‌ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్‌ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలను చేపట్టనున్న భారతీయ సంతతికి చెందిన ప్రియాంకా రాధాకృష్ణన్‌కు తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. ప్రధాని జెసిండా మంత్రివర్గంలో చేరనున్న ప్రియాంకకు అభినందనలు అంటూ ఆయన సోమవారం ట్వీట్‌​ చేశారు. న్యూజిలాండ్‌ దేశంలో ఈ స్థాయికి ఎదిగిన తొలి భారతీయురాలు అంటూ కేటీఆర్‌‌ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తాజా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జెసిండాను కూడా ఆయన […]

కాబోయే న్యూజిలాండ్‌ మంత్రికి కేటీఆర్ అభినందనలు

Updated on: Nov 02, 2020 | 3:55 PM

Minister KTR Congratulates : న్యూజిలాండ్‌ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్‌ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలను చేపట్టనున్న భారతీయ సంతతికి చెందిన ప్రియాంకా రాధాకృష్ణన్‌కు తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. ప్రధాని జెసిండా మంత్రివర్గంలో చేరనున్న ప్రియాంకకు అభినందనలు అంటూ ఆయన సోమవారం ట్వీట్‌​ చేశారు. న్యూజిలాండ్‌ దేశంలో ఈ స్థాయికి ఎదిగిన తొలి భారతీయురాలు అంటూ కేటీఆర్‌‌ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తాజా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జెసిండాను కూడా ఆయన అభినందించారు.

ప్రపంచ రాజకీయాల్లో భారతీయ మహిళలు సత్తా చాటుతున్నారు. అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్ష పదవికి భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ పోటీ పడుతోన్న సమయంలో.. భారతీయ మహిళ  మరొకరు న్యూజీలాండ్ కేబినెట్‌లో చోటు సంపాదించుకోనున్నారు. ప్రధానమంత్రి జెసిండ్రా ఆర్డెర్న్ మంత్రివర్గంలో కీలక శాఖను అందుకోనున్నారు. ఓ భారతీయ మహిళకు న్యూజీలాండ్‌ కేబినెట్‌లో బెర్త్ దక్కడం ఆ దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఆమె ప్రతిభను గుర్తించిన జెసిండ్రా.. ఆమెకు కీలక శాఖను అప్పగించారు.