పట్టాభిపై దాడి ఓ డ్రామాగా అభివర్ణించిన కొడాలి నాని.. నమ్ముకున్నవారిని ముంచడం చంద్రబాబుకు అలవాటేనన్న మంత్రి

టీడీపీ సీనియర్‌ నేత పట్టాభిపై దాడి ఘటన ఏపీలో సంచలనంగా మారింది. రాజకీయ కక్షలతోనే పట్టాభి ఇంటిపై దాడి జరిగిందని టీడీపీ నేతలు..

పట్టాభిపై దాడి ఓ డ్రామాగా అభివర్ణించిన కొడాలి నాని.. నమ్ముకున్నవారిని ముంచడం చంద్రబాబుకు అలవాటేనన్న మంత్రి

Updated on: Feb 02, 2021 | 5:53 PM

టీడీపీ సీనియర్‌ నేత పట్టాభిపై దాడి ఘటన ఏపీలో సంచలనంగా మారింది. రాజకీయ కక్షలతోనే పట్టాభి ఇంటిపై దాడి జరిగిందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. దాడి వెనక వైసీపీ మంత్రి కొడాలి నాని హస్తం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నాని స్పందించారు.

పట్టాభిపై దాడిని టీడీపీ డ్రామాగా అభివర్ణించారు మంత్రి కొడాలి నాని. చంద్రబాబుది క్రిమినల్‌ బ్రెయిన్‌ అన్నారు కొడాలి. పాము తన పిల్లల్ని తానే తిన్నట్లు..నమ్ముకున్నవారినే ముంచడం చంద్రబాబుకి అలవాటేనన్నారు. జగన్‌ ప్రభుత్వంపై నిందలు మోపేందుకు చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారన్నారు.

ఫోన్‌లో మంచిగా మాట్లాడుతూనే..నామినేషన్‌ వేసేందుకొచ్చిన వైసీపీ అభ్యర్థిని అచ్చెన్నాయుడు బెదిరించారన్నారు మంత్రి కొడాలి నాని. ఓపక్క ఏకగ్రీవాలు చేయిస్తున్నామని తమపై నిందలేస్తూ…ఒత్తిడితెచ్చి ఏకగ్రీవానికి అచ్చెన్నాయుడు ప్రయత్నించారని కొడాలినాని ఆరోపించారు.

 

చల్లా ధర్మారెడ్డి క్షమాపణలు చెప్పినా వదలం.. వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్న రాములు నాయక్‌