Breaking: మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్..

తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌రావుకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ నెల 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీలో నిర్వహించిన కరోనా టెస్టుల్లో పాజిటివ్ అని తేలింది.

Breaking: మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్..

Updated on: Sep 05, 2020 | 11:11 AM

Harish Rao Corona Positive: తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌రావుకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ నెల 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీలో నిర్వహించిన కరోనా టెస్టుల్లో పాజిటివ్ అని తేలింది. ఇక ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్‌ చేశారు. ప్రాథమిక లక్షణాలు ఉండటంతో టెస్ట్‌ చేయించుకున్నానని, పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని.. ఎవరూ ఆందోళనచెందాల్సిన అవసరం లేదని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇటీవలి కాలంలో తనతో కాంటాక్ట్‌ అయిన వారు క్వారైంటన్‌లో ఉండాలని, టెస్ట్‌ చేయించుకోవాలని హరీష్‌రావు కోరారు.

Also Read: గ్రామ సచివాలయ అభ్యర్థులకు ముఖ్య గమనిక.. 12 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు..