గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దే పనిలో ఉన్నాం..

| Edited By:

Jul 10, 2019 | 2:16 PM

అర్థవంతమైన చర్చలు జరిపేందుకు.. ఎన్ని రోజులైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి కన్నబాబు అన్నారు. అసెంబ్లీ ఎన్ని రోజులు జరపాలో గతంలో చంద్రబాబు ప్రభుత్వం చెప్పలేకపోయిందని అన్నారు. ప్రతిపక్షం ఎన్ని రోజులు కోరుకుంటే అన్ని రోజులపాటు సభ నిర్వహిస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారని కన్నబాబు తెలిపారు. గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం బీఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ శాంతిభద్రతల అంశం పైనే చర్చ జరపాలని టీడీపీ […]

గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దే పనిలో ఉన్నాం..
Follow us on

అర్థవంతమైన చర్చలు జరిపేందుకు.. ఎన్ని రోజులైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి కన్నబాబు అన్నారు. అసెంబ్లీ ఎన్ని రోజులు జరపాలో గతంలో చంద్రబాబు ప్రభుత్వం చెప్పలేకపోయిందని అన్నారు. ప్రతిపక్షం ఎన్ని రోజులు కోరుకుంటే అన్ని రోజులపాటు సభ నిర్వహిస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారని కన్నబాబు తెలిపారు. గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం బీఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ శాంతిభద్రతల అంశం పైనే చర్చ జరపాలని టీడీపీ కోరిందన్నారు మంత్రి కన్నబాబు. బీఏసీ సమావేశం జరిగిన తీరు చూసి అచ్చెన్నాయుడు పశ్చాత్తాపడి ఉంటారని అన్నారు. గతంలో టీడీపీ హయాంలో జరిగిన బీఏసీలో తమకు మాట్లాడే అవకాశం ఉండేది కాదని కన్నబాబు పేర్కొన్నారు.

గత ప్రభుత్వం సమస్యలపై చర్చలను పట్టించుకున్న దాఖలాలు లేవని మంత్రి అనిల్‌కుమార్ అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దే పనిలో తాము బిజీగా ఉన్నామని చెప్పారు. గతంలో బీఏసీ సమావేశంలో తమకు మాట్లాడే అవకాశం ఉండేది కాదని ఆయన తెలిపారు. ఈ సమావేశానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, మంత్రి కన్నబాబు, టీడీపీ నుంచి అచ్చెనాయుడు తదితరులు హాజరయ్యారు.