ఆదిలాబాద్ గన్ ఫైర్ రియాక్షన్స్ : తుపాకీతో ఇద్దరిని కాల్చిన ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫారూఖ్‌, స్పందించిన ఓవైసీ బ్రదర్స్

ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరిని తుపాకీతో కాల్చిన ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫారూఖ్‌ కటకటాలపాలుకాగా, ఈ ఘటనపై ఎంఐఎం పార్టీ అధినేతలు..

ఆదిలాబాద్ గన్ ఫైర్ రియాక్షన్స్ : తుపాకీతో ఇద్దరిని కాల్చిన ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫారూఖ్‌, స్పందించిన ఓవైసీ బ్రదర్స్

Updated on: Dec 19, 2020 | 10:48 AM

ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరిని తుపాకీతో కాల్చిన ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫారూఖ్‌ కటకటాలపాలుకాగా, ఈ ఘటనపై ఎంఐఎం పార్టీ అధినేతలు ఓవైసీ బ్రదర్స్ స్పందించారు. చట్ట విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా పార్టీ సహించదని ఎంఐఎం నేతలు, కార్యకర్తలకి హెచ్చరిక జారీచేశారు. అదిలాబాద్ మజ్లిస్ జిల్లా అధ్యక్షుడిని పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. ఘటనను తీవ్రంగా ఖండించిన మజ్లిస్ పార్టీ, త్వరలోనే ఆదిలాబాద్ లో కొత్త అధ్యక్షుడుని నియమిస్తామని ఒక ప్రకటన విడుదల చేసింది.