ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కోలుకున్నారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఏప్రిల్ 23న లండన్ వెళ్లి అక్కడ చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆయన ఆరోగ్యం కుదుటపడింది. దీంతో నేడు అక్బరుద్దీన్ హైదరాబాద్ రానున్నారు. అలాగే ఈనెల 30న ఆయన ప్రజల ముందుకు రానున్నారు. అయితే గతంలో అక్బరుద్దీన్‌పై చంద్రాయణగుట్టలో హత్యాయత్నం జరిగింది. పహిల్వాన్ అనే రౌడీషీటర్ కాల్పులు జరపడంతో ఓవైసీ తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి అప్పుడప్పుడు ఆయనకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి ఓవైసీ ఆరోగ్యం క్షీణించడంతో లండన్‌కు వెళ్లారు.