త్వరలో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ నేతృత్వంలోని పార్టీతో, మజ్లిస్ పార్టీ పొత్తుపెట్టుకోబోతోందని వస్తున్న వార్తలపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. తమ పార్టీ తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తుందని అయితే, తమిళనాడులో రాజకీయ పార్టీలతో గాని, ఇతర నేతలతో కానీ మజ్లిస్ ఎలాంటి చర్చలు జరపలేదన్నారు. మీడియాలో వస్తున్న కథనాలు అంతా ఊహాగానాలే అని తేల్చిచెప్పారు. హైదరాబాద్ నుంచి తమిళనాడుకు మజ్లిస్ నేతలు వెళ్లనున్నారని, అక్కడ అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని అసద్ స్పష్టం చేశారు.