తక్కువ ధరకే అమ్ముడు పోయిన పాప్ స్టార్ నెవర్ ల్యాండ్ ఎస్టేట్.. ఆ ఆరోపణలే కారణమా.?

|

Dec 25, 2020 | 5:45 PM

పాప్ సామ్రాజ్యానికి రారాజుగా ఎదిగిన మైకెల్ జాక్సన్ 2009 జూన్ 25న అనుమానస్పద రీతిలో మరణించిన విషయం తెలిసిందే. ఈ పాప్ కింగ్ బతికున్ననన్ని రోజులు కాలిఫోర్నియాలోని నెవర్ ల్యాండ్ ఎస్టేట్‌లో జీవనం సాగించాడు.

తక్కువ ధరకే అమ్ముడు పోయిన పాప్ స్టార్ నెవర్ ల్యాండ్ ఎస్టేట్.. ఆ ఆరోపణలే కారణమా.?
Follow us on

Michael Jackson’s Neverland Ranch sold: పాప్ సామ్రాజ్యానికి రారాజుగా ఎదిగిన మైకెల్ జాక్సన్ 2009 జూన్ 25న అనుమానస్పద రీతిలో మరణించిన విషయం తెలిసిందే. ఈ పాప్ కింగ్ బతికున్ననన్ని రోజులు కాలిఫోర్నియాలోని నెవర్ ల్యాండ్ ఎస్టేట్‌లో జీవనం సాగించాడు. జాక్సన్ ఈ ఇంటిని ఎంతో అభిమానించేవాడు. సుమారు 2700 ఎకరాల్లో ఉన్న ఈ ఎస్టేట్‌ను అతని అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దుకున్నాడు.
ఇదిలా ఉంటే జాక్సన్ మరణించిన తర్వాత ఈ ఎస్టేట్‌ను థామ‌స్ క్యాపిట‌ల్ ఇన్వెస్ట్‌మెంట్ 23 మిలియ‌న్ల డాలర్లకు సొంతం చేసుకుంది. తాజాగా నెవర్ ల్యాండ్‌ను అమెరికాకు చెందిన బిలియనీర్ రాబ్ బర్క్లే కొనుగోలు చేశారు. ఈ ఎస్టేట్ సుమారు 22 మిలియన్ల డాలర్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. నిజానికి 2015లో ఈ ఎస్టేట్‌ను వంద మిలియన్ల డాలర్లకు అమ్మేందుకు ప్రయత్నాలు జరిగాయి.. కానీ బర్ల్కే ఇప్పుడు కేవలం 22 మిలియన్ల డాలర్లకే కొనుగోలు చేయడం గమనార్హం. ఇక మైకేల్ ఈ ఎస్టేట్‌లోనే చిన్న పిల్లలపై లైంగిక దాడికి దిగాడని అప్పట్లో ఆరోణలు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా మైకేల్ మరణించిన తర్వాత ఈ ఇంటిలో దెయ్యంలా తిరిగాడని కూడా అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. వీటి కారణంగానే ఈ ఎస్టేట్ తక్కువ ధరకు అమ్ముడుపోయిందని ఓ ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ ఎస్టేట్‌ను మైకేల్ 1980వ దశకంలో 20 మిలియన్ల డాలర్లకు ఖరీదు చేశాడు.