Health News: ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మెంతులు.. అధ్యయనంలో బయటపడ్డ విషయాలెంటీ ?…

| Edited By: Pardhasaradhi Peri

Dec 29, 2020 | 10:04 AM

ప్రస్తుత కాలంలో మన శరీరానికి ఇమ్యూనిటీ పవర్ చాలా ముఖ్యం. రోగనిరోదక శక్తిని పెంపోందిచాడానికి మనం ఎన్నో రకాల పదార్థాలను తింటుంటాం.

Health News: ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మెంతులు.. అధ్యయనంలో బయటపడ్డ విషయాలెంటీ ?...
Follow us on

ప్రస్తుత కాలంలో మన శరీరానికి ఇమ్యూనిటీ పవర్ చాలా ముఖ్యం. రోగనిరోదక శక్తిని పెంపోందిచాడానికి మనం ఎన్నో రకాల పదార్థాలను తింటుంటాం. అటు ఆకుకూరలు, వెజిటేబుల్స్‏తో విటమిన్ల లోపాన్ని అధిగమించవచ్చు. వీటితో పాటు మెంతులు, మెంతి ఆకుల్లో కూడా పుష్కలంగా ఆయుర్వేద ఔషధగుణాలుంటాయట. సాధరణంగా భారతీయ వంటశాలలో ఉపయోగించేవి మెంతులు. ఇవి ఆహరానికి రుచిని మాత్రమే కాకుండా, శరీరానికి ఆరోగ్యానికి మేలు చేస్తాయట. ఇందులో గ్లోకోజ్, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి అనేక ప్రయోజనాలను చేకురుస్తాయని చెబుతున్నారు నిపుణులు.

మెంతులను ఆహరంలో వాడటం వలన బరువు తగ్గిస్తుందని వెల్లడైంది. 2014లో ఫార్మకాలజిస్ట్ బృందం ఎలుకలపై మెంతుల ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది అధ్యయనం చేశారు. ఊబకాయం ఉన్న ఎలుకలలో కొవ్వు తగ్గిపోయినట్లుగా స్టడీలో తెలిసింది. డాక్టర్ అన్నాడోరా జె.బ్రూస్ కెల్లర్ బృందం నిర్వహించిన మరో అధ్యయనంలో ఆహార జీర్ణక్రియకు అవసరమైన గట్ బ్యాక్టీరియాపై అధిక కొవ్వు ఆహారం వల్ల కలిగే ప్రభావాలను మెంతిలో ఉన్నట్లు కనుగోన్నారు. అంతేకాకుండా మెంతులు వారిపై మంచి ప్రభావాన్ని చూపుతుందా అని తెలుసుకోవడానికి ఫార్మాకాలజిస్ట్ హ్యూగస్ చెవాసన్ అధిక బరువు గల పురుషులపై 2019 స్వల్పకాలిక అధ్యయనం చేశారు. ఆరు వారాల పాటు అధిక బరువు ఉన్న పురుషులకు మెంతులు కలిసిన ఆహరాన్ని అందించారు. దీనివలన బరువు, ఆకలి, గ్లూకోజ్, ఇన్సులిన్ స్థాయిలపై ప్రభావాలను అధ్యయనం చేశారు. ముఖ్యంగా అధిక బరువు ఉన్న వారిలో కొవ్వు భారీగా తగ్గినట్లుగా తేలింది. మెంతులు కలిసిన టీ తాగడం వలన బరువు తగ్గుతారంట.