AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోదీ ప్రమాణ స్వీకారానికి వాళ్ళే ‘ స్పెషల్ గెస్ట్స్ ‘!

ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారానికి వెస్ట్ బెంగాల్ లో హతులైన 50 మంది బీజేపీ కార్యకర్తల కుటుంబాలను ఆహ్వానిస్తున్నారు. వారిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఇన్వైట్ చేయాలని మోదీ , బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మధ్య సుదీర్ఘంగా.. 5 గంటలపాటు జరిగిన సమావేశంలో నిర్ణయించారు. వీరు ఢిల్లీలో బీజేపీ నేతల ‘ సంరక్షణ ‘ లో ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ఆహ్వానితుల జాబితా సిధ్ధమైందని, దీన్ని రాష్ట్రపతి భవన్ కు అందజేస్తామని ఈ వర్గాలు […]

మోదీ ప్రమాణ స్వీకారానికి వాళ్ళే ' స్పెషల్ గెస్ట్స్ '!
Pardhasaradhi Peri
| Edited By: |

Updated on: May 29, 2019 | 2:40 PM

Share

ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారానికి వెస్ట్ బెంగాల్ లో హతులైన 50 మంది బీజేపీ కార్యకర్తల కుటుంబాలను ఆహ్వానిస్తున్నారు. వారిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఇన్వైట్ చేయాలని మోదీ , బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మధ్య సుదీర్ఘంగా.. 5 గంటలపాటు జరిగిన సమావేశంలో నిర్ణయించారు. వీరు ఢిల్లీలో బీజేపీ నేతల ‘ సంరక్షణ ‘ లో ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ఆహ్వానితుల జాబితా సిధ్ధమైందని, దీన్ని రాష్ట్రపతి భవన్ కు అందజేస్తామని ఈ వర్గాలు పేర్కొన్నాయి. పశ్చిమ బెంగాల్ లో గత ఆరేళ్లలో జరిగిన పంచాయతీ, లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లో సుమారు 50 మంది బీజేపీ కార్యకర్తలు హతులయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే వీరిని పొట్టన బెట్టుకున్నారని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల అనంతరం అమిత్ షా.. హతులైన పార్టీ కార్యకర్తల కుటుంబాల్లో కొన్నింటిని పరామర్శించారు. పార్టీ మీకు ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు..కాగా-మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దాదాపు ఏడువేల మంది హాజరవుతున్నారు..

కాగా-ఈ కుటుంబాలను ఆహ్వానించాలని మోదీ తీసుకున్న నిర్ణయం బెంగాల్ రాష్ట్రాన్ని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ .ని రాజకీయంగా ఎదుర్కోవడానికేనని భావిస్తున్నారు. బెంగాల్ లో మరో రెండేళ్ళలో.. 2021 లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ముందే దీదీని దెబ్బ తీయాలంటే ఇలాంటి ‘ నిర్ణయాలు ‘ చాలా ముఖ్యమని బీజేపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో కూడా పలువురు బీజేపీ కార్యకర్తలు టీఎంసి శ్రేణులతో జరిగిన ఘర్షణల్లో మరణించారు. ఈ ఎన్నికల్లో కమలనాథులు గతంతో (2014) తో పోలిస్తే రెండు సీట్ల నుంచి 18 సీట్లను గెలుచుకోవడం, అధికార టీఎంసీ సీట్లు 34 నుంచి 22 కు పడిపోవడం పొలిటికల్ గా బీజేపీకి బాగా కలిసివచ్ఛే అంశం. అటు-టీఎంసి నుంచి సుమారు 60 మంది బీజేపీ శిబిరంలో జంప్ చేయడానికి రెడీ అయ్యారు. వీరిలో చాలామంది అప్పుడే ఆ పార్టీ తీర్థం పుచ్ఛుకున్నారు కూడా. .. దీంతో పశ్చిమ బెంగాల్ లో మమత పట్టు మరింత దిగజారుతుందని కమలనాథులు సంబరపడుతున్నారు.

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల