సూపర్ రజనీకాంత్ స్పందించారు. ఓ అద్భుతమైన మెసెజ్‌ను పోస్ట్ చేశారు. మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. కొడంబాక్కమ్ లో రాఘవేంద్ర కళ్యాణ మండపానికి ట్యాక్స్ చెల్లించాలని గ్రేటర్ చెన్నై మున్సిపల్ కార్పోరేషన్ డిమాండ్ చేయడాన్ని సవాలు చేస్తూ రజనీకాంత్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
అయితే దీనిపై ట్యాక్స్ చెల్లింపు డిమాండ్‌కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించినందుకు జరిమానా విధించాల్సి ఉంటుందని రజనీకాంత్ ను మద్రాస్ హైకోర్టు హెచ్చరించింది. కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో తమకు కేసు విత్ డ్రా చేసుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని రజనీ తరపు లాయర్ ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే రజనీకాంత్ ఇదే అంశంపై తాజాగా తన ట్వీట్టర్‌లో పోస్ట్ చేశారు.
గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులకు ఈ విషయమై ఇప్పటికే అప్పీలు చేశామని.. తమ లోపాన్ని సరిదిద్దవచ్చని పేర్కొంటూ ట్వీట్ చేశారు. అనుభవం పాఠం లాంటిదని రజనీ ట్వీట్ పేర్కొనడం విశేషం. ” రాఘవేంద్ర హాల్ ఆస్తిపన్ను… మేము కార్పొరేషన్‌కు విజ్ఞప్తి చేసి ఉండాలి. తప్పును నివారించవచ్చు.” అంటూ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ராகவேந்திரா மண்டப சொத்து வரி…
நாம் மாநகராட்சியில் மேல்முறையீடு செய்திருக்க வேண்டும்.
தவறைத் தவிர்த்திருக்கலாம்.#அனுபவமே_பாடம்
— Rajinikanth (@rajinikanth) October 15, 2020