జిమ్‌లో @ 60 ‘మెగా హీరో’ కసరత్తులు

| Edited By:

Nov 09, 2019 | 1:46 PM

ఇటీవలే ‘సైరా’ సినిమాతో మెగాస్టార్‌ అంటే.. ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు చిరు. ఇప్పటికి కూడా.. సిల్వర్ స్క్రీన్‌పై ఆయన క్రేజ్, జోరు ఏమాత్రం తగ్గలేదని మరోమారు నిరూపించుకున్నాడు. సైరా సినిమాతో బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన చిరంజీవి.. తదుపరి చిత్రాలకు కూడా.. సైన్‌ చేసి.. దూకుడు పెంచాడు. తాజాగా.. ఆయన 152వ చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి కూడా.. రాంచరణ్‌నే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. వచ్చే నెలలో […]

జిమ్‌లో @ 60 మెగా హీరో కసరత్తులు
Follow us on

ఇటీవలే ‘సైరా’ సినిమాతో మెగాస్టార్‌ అంటే.. ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు చిరు. ఇప్పటికి కూడా.. సిల్వర్ స్క్రీన్‌పై ఆయన క్రేజ్, జోరు ఏమాత్రం తగ్గలేదని మరోమారు నిరూపించుకున్నాడు. సైరా సినిమాతో బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన చిరంజీవి.. తదుపరి చిత్రాలకు కూడా.. సైన్‌ చేసి.. దూకుడు పెంచాడు. తాజాగా.. ఆయన 152వ చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి కూడా.. రాంచరణ్‌నే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

అయితే.. చిరు ఎంత బాగా నటించినా.. ఈ 60లలో వృద్ధ్యాప్య ఛాయలు, అలాగే.. కుర్ర హీరోగా నటించాలంటే.. ఆమాత్రం స్టామినా కావాలి కదా. దీంతో.. మెగాస్టార్.. జిమ్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం చిరు జిమ్‌లో కసరత్తులు చేస్తోన్న చిత్రం వైరల్‌గా మారింది. ఈ ఫొటో చూసిన చూసిన అభిమానులు, ప్రేక్షకులు సైతం షాక్ అవుతున్నారు.