ధూం ధాంగా నిహారిక పెళ్లి వేడుక.. ‘బంగారు కోడి పెట్ట వచ్చెనండీ’ పాటకు చిరు ఫ్యామిలీ స్టెప్పులు

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘ఘరానా మొగుడు’ చిత్రంలోని ‘బంగారు కోడి పెట్ట వచ్చెనండీ’ పాటకు మెగస్టార్ చిరంజీవి, బన్నీ వేసిన స్టెప్పులు నెట్టింట్లో వైరల్‌గా మారుతున్నాయి. దీనికి సంబంధించిన..

ధూం ధాంగా నిహారిక పెళ్లి వేడుక.. ‘బంగారు కోడి పెట్ట వచ్చెనండీ’ పాటకు చిరు ఫ్యామిలీ స్టెప్పులు

Updated on: Dec 09, 2020 | 5:13 AM

Chiranjeevi Dance : నిహారిక పెళ్లి వేడుకలు సందడిగా సాగుతోంది. మరికొన్ని గంటల్లో నిహారిక-చైతన్యల పెళ్లి జరగనుంది. దీంతో మెగా, అల్లు కుటుంబ సభ్యులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. సోమవారం జరిగిన సంగీత్‌ కార్యక్రమంలో నృత్యాలతో అదరగొట్టిన కుటుంబ సభ్యులు మంగళవారం సైతం స్టెప్పులతో మరింత జోష్ పెంచారు.

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘ఘరానా మొగుడు’ చిత్రంలోని ‘బంగారు కోడి పెట్ట వచ్చెనండీ’ పాటకు మెగస్టార్ చిరంజీవి, బన్నీ వేసిన స్టెప్పులు నెట్టింట్లో వైరల్‌గా మారుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలను చూసి మెగా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

ఈ పాటకు చిరంజీవి సతీమణి సైతం స్టెప్పులు వేశారు. మరోవైపు పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్ కూడా ఉదయ్‌పూర్‌కు చేరుకోవడంతో ‘ఆఖరి ఆనందం వచ్చేసిందంటూ’ నాగబాబు ఫొటో షేర్‌ చేశారు. పెళ్లి వేడుకల్లో భాగంగా అందరూ కలిసిఉన్న ఫొటోలను నాగబాబు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. డిసెంబర్‌ 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు చైతన్య-నిహారికల పెళ్లి జరగబోతోంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌విలాస్‌ దీనికి వేదిక కానుంది.