బంధువులకు కీలక పదవులు: మాయావతి

వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా నిత్యం మాట్లాడే బీఎస్పీ అధినేత్రి మాయావతి తన సోదరడు కుమార్‌ను పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా, మేనల్లుడు ఆకాష్‌ ఆనంద్‌ను జాతీయ సమన్వయకర్తగా నియమించారు. లక్నోలో ఆదివారం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకన్నారు. లోక్‌సభలో పార్టీ నేతగా అమ్రోహ ఎంపీ దానిష్‌ అలీని నియమించారు. కాగా మాయావతి తన వారసుడిగా సోదరుడి కుమారుడు ఆకాష్‌ను ప్రోత్సహిస్తున్నారని బీఎస్పీ వర్గాలు పేర్కొన్నాయి. పలు పార్టీ సమావేశాల్లో ఆయన పాల్గొంటుండటం ఈ ఊహాగానాలకు […]

బంధువులకు కీలక పదవులు: మాయావతి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Jun 24, 2019 | 7:20 PM

వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా నిత్యం మాట్లాడే బీఎస్పీ అధినేత్రి మాయావతి తన సోదరడు కుమార్‌ను పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా, మేనల్లుడు ఆకాష్‌ ఆనంద్‌ను జాతీయ సమన్వయకర్తగా నియమించారు. లక్నోలో ఆదివారం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకన్నారు. లోక్‌సభలో పార్టీ నేతగా అమ్రోహ ఎంపీ దానిష్‌ అలీని నియమించారు. కాగా మాయావతి తన వారసుడిగా సోదరుడి కుమారుడు ఆకాష్‌ను ప్రోత్సహిస్తున్నారని బీఎస్పీ వర్గాలు పేర్కొన్నాయి. పలు పార్టీ సమావేశాల్లో ఆయన పాల్గొంటుండటం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిస్తోంది.