AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రికి రాత్రి 1200 గ్రాముల బంగారు, 10 కిలోల వెండి మాయం.. కృష్ణా జిల్లాలో భారీ చోరీ…

కృష్ణాలో భారీ చోరీ జరిగింది. పమిడిముక్కల మండలంలో గురజాడలో  ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ చోరీలో రూ. కోటికి పైగా విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు దొంగిలించారు. గ్రామానికి చెందిన వృద్ధురాలు చల్లా రాజేశ్వరి గత కొంత కాలంగా ఒంటరిగా...

రాత్రికి రాత్రి 1200 గ్రాముల బంగారు, 10 కిలోల వెండి మాయం.. కృష్ణా జిల్లాలో భారీ చోరీ...
Sanjay Kasula
|

Updated on: Nov 25, 2020 | 12:23 PM

Share

Massive Theft : కృష్ణాలో భారీ చోరీ జరిగింది. పమిడిముక్కల మండలంలో గురజాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ చోరీలో రూ. కోటికి పైగా విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు దొంగిలించారు. గ్రామానికి చెందిన వృద్ధురాలు చల్లా రాజేశ్వరి గత కొంత కాలంగా ఒంటరిగా ఉంటారు. చల్లా రాజేశ్వరి కుమారుడు సింగపూర్‌లో ఉంటున్నారు.

ఆమె గృహానికి తాళం వేసి మచిలీపట్నంలోని బంధువుల ఇంటికి వెళ్లి సోమవారం రాత్రి ఇంటికి తిరిగి రావడంతో ఈ చోరీ వెలుగులోకి వచ్చింది. ఇంటి ప్రధాన ద్వారం గడియ విరగ్గొట్టి, లోపల బీరువాలు తెరిచి ఉన్నట్లు ఆమె గుర్తించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా బంగారు, వెండి ఆభరణాలు కనిపించలేదు.

దీంతో సోమవారం రాత్రి రాజేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీరువాల్లో ఉంచిన 1200 గ్రాముల బంగారు, 10 కిలోల వెండి ఆభరణాలు, వస్తువులు అపహరణకు గురైనట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీపీ బత్తిన శ్రీనివాసులు, ఏసీపీ కె.విజయపాల్‌, క్రైం ఏడీసీపీ సుభాష్‌చంద్రబోస్‌, సీఐలు నాగవరప్రసాద్‌, శివాజీరాజు, ఇతర పోలీసు అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివరాలు తెలుసుకున్నారు. ఆధారాల సేకరణ బృందం వారు వేలిముద్రలు సేకరించారు. ఈ చోరీలో పాల్గొన్నది ఎవరూ అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Follow Us
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!