మహిళా ఉద్యోగులకు మార్ష్‌ల్‌ ఆర్ట్స్‌..!

|

Nov 12, 2019 | 7:55 PM

సురేష్‌ అనే వ్యక్తి చేతిలో పెట్రోల్‌ దాడిలో మృతిచెందిన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ ఎమ్మార్వో విజయారెడ్డి సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటన తర్వాత మరో రెండు చోట్ల ఇద్దరు రైతులు ఎమ్మార్వో కార్యాలయానికి పెట్రోల్‌ తీసుకెళ్లారు. దీంతో ఆ ఆఫీస్లో ఉన్న సిబ్బంది హడలిపోయారు. మరికొన్ని చోట్ల ముందస్తుగానే తగిన జాగ్రత్త చర్యలు చేపట్టారు. మరికొందరు అధికారులు స్వతహాగానే కొన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా […]

మహిళా ఉద్యోగులకు మార్ష్‌ల్‌ ఆర్ట్స్‌..!
Follow us on

సురేష్‌ అనే వ్యక్తి చేతిలో పెట్రోల్‌ దాడిలో మృతిచెందిన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ ఎమ్మార్వో విజయారెడ్డి సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటన తర్వాత మరో రెండు చోట్ల ఇద్దరు రైతులు ఎమ్మార్వో కార్యాలయానికి పెట్రోల్‌ తీసుకెళ్లారు. దీంతో ఆ ఆఫీస్లో ఉన్న సిబ్బంది హడలిపోయారు. మరికొన్ని చోట్ల ముందస్తుగానే తగిన జాగ్రత్త చర్యలు చేపట్టారు. మరికొందరు అధికారులు స్వతహాగానే కొన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగినుల భద్రతా ప్రశ్నార్థకంగా మారిందని భావించిన సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు మహిళ ఉద్యోగుల ఆత్మరక్షణ కోసం మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ ఇవ్వాలని హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోతంది. ఇందులో భాగంగా… అనుకొని సంఘటనలు ఎదురైనప్పుడు సమయస్పూర్తితో వ్యవహరించి.. సురక్షితంగా తప్పించుకునేందుకు వీలుగా ఉద్యోగినులందరూ తప్పనిసరిగా ఈ శిక్షణను పొందాలని నిర్ణయించారు.