మరో వివాదంలో మన్సాస్ యాజమాన్యం.. అయోధ్య మైదానంలో ఆంక్షలు, మండిపడుతోన్న విజయనగర వాసులు

|

Dec 15, 2020 | 8:55 AM

మన్సాస్ యాజమాన్య తాజా నిర్ణయం మరో వివాదానికి దారితీసింది.. దశాబ్దాలుగా విజయనగరం మహారాజ కళాశాల అయోధ్య మైదానంలో వాకింగ్ చేస్తున్న..

మరో వివాదంలో మన్సాస్ యాజమాన్యం..  అయోధ్య మైదానంలో ఆంక్షలు, మండిపడుతోన్న విజయనగర వాసులు
Follow us on

మన్సాస్ యాజమాన్య తాజా నిర్ణయం మరో వివాదానికి దారితీసింది.. దశాబ్దాలుగా విజయనగరం మహారాజ కళాశాల అయోధ్య మైదానంలో వాకింగ్ చేస్తున్న నగరవాసులకు షాక్ ఇచ్చింది. ఇక పై కాలేజ్ గ్రౌండ్ లో వాకింగ్ చేయటానికి అనుమతించేది లేదంటూ ఆంక్షలు విధించారు. రాత్రికి రాత్రి గేటుకు నోటీసులు అంటించడంతో ఎప్పటిలా తెల్లవారుజామున వాకింగ్ కి వచ్చే వాకర్స్ కి నిరాశ ఎదురైంది. దీంతో మాన్సస్ యాజమాన్యం పై వాకర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ గేటు వద్దే ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారం పై ఎస్ ఎఫ్ ఐ తో పాటు పలు రాజకీయ పార్టీ నేతలు కూడా మరికాసేపట్లో నిరసనలు వ్యక్తం చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. అయోధ్య క్రీడా మైదానంలో వాకింగ్ చేయనీయకుండా యాజమాన్యం నిర్ణయం తీసుకోవడం మంచి పద్ధతి కాదని, మాన్సస్ ఎవరి సొంత ఆస్తి కాదని మండిపడుతున్నారు వాకర్స్.