భార్యతో విడాకులు.. క్లారిటీ ఇచ్చిన మంచువారబ్బాయి!

|

Oct 17, 2019 | 6:26 PM

హీరో మంచి మనోజ్ కొద్దికాలంగా నటనకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎన్నో ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి కూడా. ఇప్పుడు వాటన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ హీరో మనోజ్ తాజాగా తన వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఓ ఎమోషనల్ పోస్ట్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ‘నా వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నా. నేను నా భార్యతో విడాకులు తీసుకున్నాను. మా ఇద్దరి మధ్యన చాలా సందర్భాల్లో మనస్పర్థలు వచ్చిన నేపథ్యంలో […]

భార్యతో విడాకులు.. క్లారిటీ ఇచ్చిన మంచువారబ్బాయి!
Follow us on

హీరో మంచి మనోజ్ కొద్దికాలంగా నటనకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎన్నో ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి కూడా. ఇప్పుడు వాటన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ హీరో మనోజ్ తాజాగా తన వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఓ ఎమోషనల్ పోస్ట్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

‘నా వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నా. నేను నా భార్యతో విడాకులు తీసుకున్నాను. మా ఇద్దరి మధ్యన చాలా సందర్భాల్లో మనస్పర్థలు వచ్చిన నేపథ్యంలో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. అంతేకాక కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు కూడా దూరమయ్యాను. ఇంతకాలం నా కుటుంబంతో పాటుగా స్నేహితులు, అభిమానులు నాకు ఎంతో సపోర్టుగా నిలిచారు. వారందరికీ నా కృతజ్ఞతలు. మళ్ళీ నేను సినిమాల్లో నటించనున్నాను’ అని మనోజ్ ఆ ఎమోషనల్ పోస్ట్‌లో పేర్కొన్నాడు.