AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తెలివైన పనిమంతుడు…జోరువానలో గొడుగుపట్టుకుని.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో.!

పరమానందయ్య శిష్యుల కథ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇతను కూడా వారి శిష్యరిక బృందానికి చెందిన వ్యక్తే అనుకుంటా.. అచ్చం వారిలానే..

Viral Video: తెలివైన పనిమంతుడు...జోరువానలో గొడుగుపట్టుకుని.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో.!
Sincere Worker
Ravi Kiran
|

Updated on: Jun 17, 2021 | 1:56 PM

Share

పరమానందయ్య శిష్యుల కథ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇతను కూడా వారి శిష్యరిక బృందానికి చెందిన వ్యక్తే అనుకుంటా.. అచ్చం వారిలానే చేస్తున్నాడు. ఏదీ ఏమైనా చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తున్నాడు. అది వర్షంపడినా, పిడుగు పడ్డా.. మాట తప్పటం లేదు. ఇదిగో ఇక్కడో వ్యక్తి ఏం చేస్తున్నాడో.. చూస్తున్నారుగా, అందుకే ఇతన్ని పరమానందయ్య శిష్యుల బృందానికి చెందిన వ్యక్తిగా చెప్పాల్సి వచ్చింది.

జోరుగా వర్షం పడుతుంటే..ఇతడు చేస్తున్న పని విచిత్రంగా ఉంది కదూ..అసలే పైనుంచి కిందకు ఏకధాటికిగా వర్షం కురుస్తోంది. ఆ వర్షంలో గొడుగు పట్టుకుని మరీ ఇతగాడు..సిమెంటు ఇటుకలకు నీళ్లు కొడుతున్నాడు. ఇంతటి వానలో వాటిని మళ్లీ తడపటం అవసరమా చెప్పండి.? ఈ అద్భుతమైన వీడియోను ఐఎఫ్‌ఎస్‌ అధికారి సుశాంత నందా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. కాగా, ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్‌, లైకులు వచ్చాయి. వీడియో చూసిన నెటిజన్లు సదరు వ్యక్తికి పని పట్ల గల అంకిత భావం అర్థం అవుతుందంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు నెటిజన్లు మంచి పనిమంతుడు అంటున్నారు. ఇంకొందరైతే, ఏం తెలివిరా బాబు అంటూ ఫన్నీగా కామెంట్‌ చేస్తున్నారు.

తెలివైన పనిమంతుడు వీడియో..

Also Read:

గంగా నదిలో కొట్టుకొచ్చిన చెక్కపెట్టె.. అందులో ఎర్రని వస్త్రంలో చిన్నారి.! ఎక్కడ నుంచి వచ్చిందంటే.!

మీ బ్యాంక్ ఖాతాలోకి ఎల్‌పీజీ సబ్సిడీ డబ్బు రాలేదా.? ఫిర్యాదు చేయండిలా.! వివరాలివే..

 పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఆ సౌకర్యాన్ని ఉద్యోగం కోల్పోయినా పొందొచ్చు.!

కర్ఫ్యూపై సీఎం వైఎస్ జగన్ సంకేతాలు.. జూన్ 20 నుంచి మరిన్ని సడలింపులు..!

Follow Us
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!