పాముల బావిలో నెమలి..ప్రాణాలకు తెగించిన యువకుడు !

|

Dec 02, 2019 | 6:47 PM

తమిళనాడులో ఓ యువకుడు అత్యంత సాహాసం చేశాడు. ప్రమాదవశాత్తు బావిలో పడ్డ నెమలిని కాపాడి ఒడ్డుకు చేర్చాడు. అయితే, అది మామూలు బావి కాదు.. విశాలమైన వెడల్పుతో చాలా లోతైన వ్యవసాయ బావి..అందులో దాదాపు 30 అడుగుల లోతులో నీళ్లు ఉండగా, అందులో ఉన్నవని ఎన్నో రకాల విష సర్పాలే. అందుకే, గజ ఈతగాళ్లు సైతం ఆ బావిలో దిగాలనే సాహసం చేయరు. అటువంటి బావిలో పడిపోయిన నెమలిని ప్రాణాలకు తెగించి రక్షించాడు. నీళ్లల్లో మునిగిపోతూ..అరుస్తూ..కనిపించిన నెమలిని […]

పాముల బావిలో నెమలి..ప్రాణాలకు తెగించిన యువకుడు !
Follow us on

తమిళనాడులో ఓ యువకుడు అత్యంత సాహాసం చేశాడు. ప్రమాదవశాత్తు బావిలో పడ్డ నెమలిని కాపాడి ఒడ్డుకు చేర్చాడు. అయితే, అది మామూలు బావి కాదు.. విశాలమైన వెడల్పుతో చాలా లోతైన వ్యవసాయ బావి..అందులో దాదాపు 30 అడుగుల లోతులో నీళ్లు ఉండగా, అందులో ఉన్నవని ఎన్నో రకాల విష సర్పాలే. అందుకే, గజ ఈతగాళ్లు సైతం ఆ బావిలో దిగాలనే సాహసం చేయరు. అటువంటి బావిలో పడిపోయిన నెమలిని ప్రాణాలకు తెగించి రక్షించాడు. నీళ్లల్లో మునిగిపోతూ..అరుస్తూ..కనిపించిన నెమలిని గమనించిన యువకుడు..స్థానికంగా మరికొందరు యువకుల సాయంతో నడుముకు తాళ్లు కట్టుకుని చాలా చాకచక్యంగా బావిలోకి దిగాడు.  విష సర్పాలను తప్పించుకుంటూ..ఎట్టకేలకు ఆ నెమలిని రక్షించాడు. బావిలోంచి తీసుకొచ్చిన ఆ నెమలిని ఒడ్డున విడిచిపెట్టగానే…అది రెక్కలు విప్పుకుని ఎగురుకుంటూ వెళ్లిపోయింది. ఘటనకు సంబంధించిన వీడియోను కొందరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా, ఆ యువకుడి సాహాసాన్ని నెటిజన్లు ఎంతగానో అభినందించారు. లైకులు, కామెంట్లు చేశారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.