Man climbs cell tower : గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేస్తున్నాడు. కాకాని రోడ్డులోని బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఎక్కిన నల్లమోత వెంకట శ్యామ్ కుమార్ దూకుతానని బెదిరిస్తున్నాడు. కాకుమానులో తన పూర్వికుల నుంచి సంక్రమించిన ఇరవై ఎకరాల భూమిని చెరువుగా మార్చే ప్రయత్నం అతడు చేస్తున్నారని ఆరోపిస్తున్నాడు. రామకృష్ణ అనే వ్యక్తి తనను బెదిరిస్తున్నాడని, ఫిర్యాదు చేసినా పోలీసులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. న్యాయం చేయకుంటే టవర్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని చెప్తున్నాడు. ఈ క్రమంలో టవర్ వద్ద భారీగా స్థానికులు గుమ్మికూడారు. సమాచారం అందుకున్న పోలీసులు సెల్ టవర్ వద్దకు చేరుకున్నారు. సిఐ శోభన్ బాబు వెంకట శ్యామ్ కుమార్‌కు సర్ది చెప్పి కిందకు దింపే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read :