పాక్ ఐఎస్ఐ ఏజెంటుకు భారత మిలటరీ సమాచారం.. రాజస్థాన్‌లో పాకిస్తాన్ గూఢచారి అరెస్ట్..!

పాకిస్తాన్ గూఢచారిగా పనిచేస్తూ రాజస్థాన్ చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు..

  • Balaraju Goud
  • Publish Date - 8:32 am, Mon, 11 January 21
పాక్ ఐఎస్ఐ ఏజెంటుకు భారత మిలటరీ సమాచారం.. రాజస్థాన్‌లో పాకిస్తాన్ గూఢచారి అరెస్ట్..!

డబ్బుల కోసం పాకిస్తాన్‌కు కొమ్ముకాస్తున్న ఓ భారతీయుడిని స్పెషల్ బ్రాంచి పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ గూఢచారిగా పనిచేస్తూ రాజస్థాన్ చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. జైసల్మేర్ నగరానికి చెందిన సత్యనారాయణ్ పలివాల్ (42) పాక్ కోసం గూఢచర్యం చేస్తుండగా తాము అరెస్టు చేశామని జైపూర్ సీఐడీ పోలీసులు చెప్పారు. భారత సైన్యం, పోలీసుల సమాచారాన్ని గూఢచారి సత్యనారాయణ్ పాకిస్థాన్ దేశానికి చేరవేశాడని జైపూర్ సీఐడీ అధికారులు వెల్లడించారు. భారత మిలటరీ సమాచారాన్ని పాక్ ఐఎస్ఐ ఏజెంటుకు పంపించానని నిందితుడు సత్యనారాయణ్ అంగీకరించాడని అధికారులు తెలిపారు. పాక్ ఐఎస్ఐ ఏజెంటుతో సత్యనారాయణ్ కు సంబంధాలున్నాయని, ఆయన దేశ సైనికులకు సంబంధించిన రహస్య సమాచారాన్ని పాక్ ఐఎస్ఐ ఏజెంటుకు అందించాడని సీఐడీ పోలీసుల దర్యాప్తులో తేలింది.