‘మాలేగావ్’ పేలుళ్ల కేసు నిందితులకు బెయిల్

|

Jun 15, 2019 | 5:06 PM

మాలేగావ్‌ వరుస పేలుళ్లలో నలుగురు నిందితులకు బాంబే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.హిందూ ఉగ్రవాదం నేపథ్యంలో 2006, సెప్టెంబరు 8న నాసిక్ సమీపంలోని మాలేగావ్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 37 మంది చనిపోగా, 100 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా  ఈ పేలుళ్ల నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకుంది. ధాన్‌ సింగ్‌, లోకేశ్‌ శర్మ, మనోహర్‌ నర్వారియా, రాజేంద్ర చౌదరిలు..రూ. 50 వేలు పూచీకత్తు […]

మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితులకు బెయిల్
Follow us on

మాలేగావ్‌ వరుస పేలుళ్లలో నలుగురు నిందితులకు బాంబే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.హిందూ ఉగ్రవాదం నేపథ్యంలో 2006, సెప్టెంబరు 8న నాసిక్ సమీపంలోని మాలేగావ్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 37 మంది చనిపోగా, 100 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా  ఈ పేలుళ్ల నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకుంది. ధాన్‌ సింగ్‌, లోకేశ్‌ శర్మ, మనోహర్‌ నర్వారియా, రాజేంద్ర చౌదరిలు..రూ. 50 వేలు పూచీకత్తు సమర్పించాలని, విచారణ సమయంలో ప్రతిరోజు స్పెషల్‌ కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. సాక్ష్యాలను ప్రభావితం చేసేలా ప్రవర్తించకూడదని స్ఫష్టం చేసింది. దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన ఈ కేసులో  ఘటన జరిగిన 7 ఏళ్ళకు  2013లో నిందితులు అరెస్ట్ అయ్యారు. 2016లో ప్రత్యేక న్యాయస్థానం వీరికి బెయిల్‌ తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.