AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malayalam film ‘Jallikattu’: ఆస్కార్-2021కి మలయాళీ చిత్రం ‘జల్లికట్టు’ ఎంపిక, అఫీషియల్ ఎంట్రీ

ప్రతిష్టాత్మక ఆస్కార్ బరిలోకి మలయాళ మూవీ 'జల్లికట్టు' అధికారిక ఎంట్రీగా ఎంపికయింది. ఫ్లిల్మ్  మేకర్ రాహుల్ రానైల్ నేతృత్వంలోని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యురీ ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది..

Malayalam film 'Jallikattu': ఆస్కార్-2021కి మలయాళీ చిత్రం 'జల్లికట్టు' ఎంపిక, అఫీషియల్ ఎంట్రీ
Umakanth Rao
| Edited By: Rajesh Sharma|

Updated on: Nov 25, 2020 | 5:39 PM

Share

ప్రతిష్టాత్మక ఆస్కార్ బరిలోకి మలయాళ మూవీ ‘జల్లికట్టు’ అధికారిక ఎంట్రీగా ఎంపికయింది. ఫ్లిల్మ్  మేకర్ రాహుల్ రానైల్ నేతృత్వంలోని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యురీ ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది. లిజో జోస్  పెలిసెరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. ఓ కుగ్రామంలో ఓ బుల్ సృష్టించిన విన్యాసాలను హైలైట్ చేస్తూ నిర్మించినది. మొత్తం 26 చిత్రాలకు గాను ఈ  సినిమా  ఆస్కార్ బరిలోకి ఎంటర్ కావడం విశేషం. 14 మంది సభ్యులతో కూడిన జ్యురీ జల్లికట్టు మూవీని సెలెక్ట్ చేసినట్టు రాహుల్  తెలిపారు. ఈ చిత్రానికి  సంబంధించిన లొకేషన్,  టెక్నీకల్, హ్యూమన్ యాస్పెక్ట్స్ అన్నీ దీన్ని ఇందుకు అర్హమైనవిగా నిలబెట్టాయని ఆయన చెప్పారు. ఇటీజ్ ఎ ప్రౌడ్ ఆఫ్ టు బీ అని వ్యాఖ్యానించారు.

గత వారం రోజులుగా రోజుకు ఆన్ లైన్ లో నాలుగైదు చిత్రాలు చూస్తూ చివరకు ఈ సినిమాను ఆస్కార్ ఎంట్రీకి ఎంపిక చేశారు. గత ఏడాది అపర్ణా సేన్ నేతృత్వంలోని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా..జోయా అఖ్తర్ మూవీ ‘గల్లీ బాయ్’ ని ఎంపిక చేసింది. వడపోతలో ఇది పోయి..సౌత్ కొరియా చిత్రం.. పారాసైట్ ఎంపికైంది. కరోనా వైరస్ కారణంగా ఆస్కార్ వేడుకను వచ్ఛే ఏడాదికి వాయిదా వేశారు.