AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వైపు వెళ్తున్నారా.. వాహనదారులకు బిగ్ అలర్ట్‌..!

హైదరాబాద్‌ మహా నగరంలో ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటోంది. ఈ క్రమంలోనే అత్యంత రద్దీ కలిగిన జూబ్లీహిల్స్ చౌరస్తా సిగ్నల్ ఫ్రీగా మారబోతుంది. ఈ జంక్షన్‌లో అండర్‌పా్‌సలు, ప్లైఓవర్ల నిర్మాణం ద్వారా సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Hyderabad: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వైపు వెళ్తున్నారా.. వాహనదారులకు బిగ్ అలర్ట్‌..!
Alert For Hyderabad Citizens
Balaraju Goud
|

Updated on: Apr 04, 2026 | 8:53 AM

Share

హైదరాబాద్‌ మహా నగరంలో ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటోంది. ఈ క్రమంలోనే అత్యంత రద్దీ కలిగిన జూబ్లీహిల్స్ చౌరస్తా సిగ్నల్ ఫ్రీగా మారబోతుంది. ఈ జంక్షన్‌లో అండర్‌పా్‌సలు, ప్లైఓవర్ల నిర్మాణం ద్వారా సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్‌) పార్కు నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు ఇకపై ఎలాంటి యూటర్న్‌లు లేకుండా రయ్యుమంటూ దూసుకెళ్లే విధంగా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించనున్నారు.

హైదరాబాదులోని కేబీఆర్ పార్కు చుట్టూ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. దీంతో ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టారు పోలీసులు. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ పర్యవేక్షణ కోసం ఒకరోజు వన్ వే ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆదివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మూడు గంటల పాటు వన్ వే ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్టు ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. రానున్న రోజుల్లో ప్రస్తుతం ఏర్పాటు చేయబోతున్న ట్రయల్ రన్ రూట్లోనే వాహన రాకపోకలను కొనసాగిస్తామని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డెవిస్ తెలిపారు. హైదరాబాద్ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ట్రాఫిక్‌ పోలీసులు కోరారు.

ఒకప్పుడు భాగ్యనగరానికి సుదూరంగా.. కొండలు, గుట్టల మధ్యన ఉన్న కేబీఆర్‌ పార్ ప్రస్తుతం నగరం నడిబొడ్డుగా మారింది. హైదరాబాద్ మహానగరంలోని ముఖ్య ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ పార్కు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి, మాదాపూర్‌, హైటెక్‌ సిటీ, కొండాపూర్‌, ఫైనాన్షియల్‌ డిస్ర్టిక్ట్‌.. ఇలా ఆయా ప్రాంతాలను కలుపుతూ.. ముఖ్యమైన రోడ్లన్నీ కేబీఆర్‌ పార్కు నుంచే ఉన్నాయి. దాంతోపాటు కేబీఆర్‌ పార్కు చుట్టూ ఉన్న జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిలింనగర్‌, కృష్ణానగర్‌ తదితర ప్రాంతాలన్నీ వ్యాపార, వాణిజ్యపరంగా ఎంతో అభివృద్ధి చెందాయి. ఐటీ, సినీ, రాజకీయ నేతలతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులంతా ఈ ప్రాంతంలోనే నివాసముంటారు. ఇలా అనేక ప్రాంతాలకు అనుసంధానమైన కేబీఆర్‌ పార్కు చుట్టురా రోడ్లు ఏ సమయంలోనైనా రద్దీగా ఉంటాయి. దీంతో భారీగా ట్రాఫిక్ సమస్యలతో సామాన్యులు సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సమస్యకు పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us