ఆ నాలుగు రాష్ట్రాల్లో కోవిడ్ 19 ఉధృతి, అప్రమత్తం కావాలని కేంద్రం హెచ్ఛరిక, గైడ్ లైన్స్ పై దృష్టి పెట్టాలని సూచన

దేశంలో నాలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరిగిపోవడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. కేరళ, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో దేశంలోని..

ఆ నాలుగు రాష్ట్రాల్లో కోవిడ్ 19 ఉధృతి, అప్రమత్తం కావాలని కేంద్రం హెచ్ఛరిక, గైడ్ లైన్స్ పై దృష్టి పెట్టాలని సూచన
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 07, 2021 | 7:42 PM

Corona Virus:దేశంలో నాలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరిగిపోవడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. కేరళ, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో దేశంలోని అన్ని కేసుల్లోకెల్లా 59 శాతం కేసులు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. వెంటనే వీటిని అదుపు చేసేందుకు ఈ రాష్ట్రాలు తప్పనిసరిగా ఖచ్చితమైన గైడ్ లైన్స్  జారీ చేయాలని కోరుతున్నామన్నారు. అలాగే కొత్త మ్యుటెంట్ కేసులు వ్యాపించకుండా అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ మేరకు ఈ రాష్ట్రాలకు లేఖలు రాసినట్టు ఆయన చెప్పారు. ఇతర రాష్ట్రాలు పాటిస్తున్నటెస్ట్, ట్రాక్, ట్రీట్ అన్న విధానాన్ని ఇవి కూడా అనుసరించాలని కోరుతున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చూడాలని,  అలాగే సామాజిక దూరం పాటింపు కూడా ఇప్పటికీ తప్పనిసరి అని  గుర్తు చేశామని ఆయన తెలిపారు. ఇటీవలి కాలంలో ఈ నాలుగు రాష్ట్రాల్లో హఠాత్తుగా కోవిడ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.  మహారాష్ట్రలో 52 వేలు, ఛత్తీస్ గఢ్, బెంగాల్ లో 9 వేలు, కేరళలో కొత్తగా 5 వేల యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే ఈ రాష్ట్రాల్లో కరోనా రోగుల మృతి కేసులు కూడా ఎక్కువగా ఉన్నాయి.

Also Read:

Latest crime news: నర్సంపేటలో విషాద ఘటన.. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. ప్రమాదం ఎలా జరిగిందంటే..

బర్డ్ ఫ్లూ నేపథ్యంలో అప్రమత్తమైన హైదరాబాద్ జూ పార్క్ అధికారులు.. పక్షుల సంరక్షణకు ప్రత్యేక రాపిడ్ యాక్షన్ ఫోర్స్

డొనాల్డ్ ట్రంప్ ను అరెస్టు చేయాలంటూ ఇరాక్ కోర్టు వారంట్ జారీ, అయితే సాధ్యమవుతుందా ? నిపుణుల సందేహాలు