బర్డ్ ఫ్లూ నేపథ్యంలో అప్రమత్తమైన హైదరాబాద్ జూ పార్క్ అధికారులు.. పక్షుల సంరక్షణకు ప్రత్యేక రాపిడ్ యాక్షన్ ఫోర్స్

బర్డ్ ఫ్లూ నేపథ్యంలో హైదరాబాద్ జూ పార్క్ అధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టారు. డిప్యూటీ డైరెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశారు.

బర్డ్ ఫ్లూ నేపథ్యంలో అప్రమత్తమైన హైదరాబాద్ జూ పార్క్ అధికారులు..  పక్షుల సంరక్షణకు ప్రత్యేక రాపిడ్ యాక్షన్ ఫోర్స్
Follow us

|

Updated on: Jan 07, 2021 | 7:25 PM

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న ఏవియన్ ఇన్ ఫ్లూయంజా కారణంగా తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో హైదరాబాద్ జూ పార్క్ అధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టారు. డిప్యూటీ డైరెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ పక్షులను జూ వైద్యులు, అధికారుల నిరంతర పర్యవేక్షించనున్నారు. పక్షులు ఉండే ప్రదేశాల్లో మరింత మెరుగైన శుభ్రత ఏర్పాట్లు చేస్తున్నారు జూ అధికారులు.

బర్డ్ ఫ్లూ వైరస్ హైదరాబాద్ జవహర్ లాల్ నెహ్రూ జూలాజికల్ పార్క్‌లోని పక్షులకు చేరకుండా తగిన చర్యలకు ఉపక్రమించింది. పక్షులు ఉండే ప్రదేశాల్లో సందర్శకులకు పరిమితులు విధించారు జూ అధికారులు. వలస పక్షులను కూడా మానిటరింగ్ చేయనున్నారు. ఇతర పక్షులు… జూలో పక్షుల వద్దకు చేరకుండా రిఫ్లెక్షన్ రిబ్బన్ లను కూడా ఏర్పాటు చేశారు. మాంసాహార జంతువులకు.. రా చికెన్‌కి బదులుగా మీట్ అందించనున్నట్లు జూ అధికారులు తెలిపారు. పక్షులు ఉండే ప్రదేశాల్లో యాంటీవైరల్ లిక్విడ్ స్ప్రే చేస్తున్నామని వెల్లడించారు.

పక్షుల నుంచి మనుషులకు వ్యాపించే ప్రమాదం తక్కువంటున్నారు జూ డెప్యూటీ డైరెక్టర్ హకీమ్. ఈ నేపథ్యంలో జూ లో ఉన్న పక్షుల పై మరింత అప్రమత్తంగా ఉన్నామంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో పక్షులను కాపాడుకోవడానికి తగిన చర్యలు చేపట్టామన్నారు. అసాధారణంగా చనిపోయిన పక్షులకు పోస్టుమార్టం చేసి మరణానికి గల కారణాలను కూడా పరిశీలించనున్నామని తెలిపారు.

Latest Articles
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
హైదరాబాద్‌లో కుండపోత వాన.. నగరమంతా ట్రాఫిక్‌ జామ్‌!
హైదరాబాద్‌లో కుండపోత వాన.. నగరమంతా ట్రాఫిక్‌ జామ్‌!