కత్తి మహేష్‌పై మరో కేసు
నటుడు, ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ మరో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో రాముడిపై అసభ్యకరమైన పోస్ట్‌లు పెట్టారంటూ ఫిర్యాదు అందడంతో కొద్ది రోజుల క్రితం అతడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
నటుడు, ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ మరో కేసు నమోదైంది. . సోషల్ మీడియాలో రాముడిపై అసభ్యకరమైన పోస్ట్‌లు పెట్టారంటూ ఫిర్యాదు అందడంతో కొద్ది రోజుల క్రితం అతడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై ఐపీసీ సెక్షన్ 154 కమ్యూనల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అప్పటి నుంచి జైల్లోనే ఉన్న కత్తి మహేష్‌ను తాజాగా పీటీ వారెంట్‌పై మరోసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఫిబ్రవరి నెలలో కూడా ఇలాగే సామాజిక మాధ్యమాల వేదికగా కత్తి మహేష్ వివాదాస్పద కామెంట్స్ చేశాడంటూ జింబాగ్‌కు చెందిన ఉమేష్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కత్తి మహేష్‌ని గురువారం మరోసారి అదుపులోకి తీసుకున్నట్లు సైబర్ ఇన్‌స్పెక్టర్ మోహన్‌రావు వెల్లడించారు.
Also Read:
వాహనదారులకు బ్యాడ్ న్యూస్ : మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర !