కరోనా ఎఫెక్ట్: ఔరంగాబాద్ జైల్లో లాక్‌డౌన్..

| Edited By:

Apr 19, 2020 | 6:53 PM

కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పుడు భారత్ లో కూడా విజృంభిస్తోంది. ఈ క్రమంలో ఔరంగాబాద్‌ జైలులో లాక్‍డౌన్ విధిస్తున్నట్టు మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రకటించారు. జైలు నుంచి బయటకు వెళ్లడం

కరోనా ఎఫెక్ట్: ఔరంగాబాద్ జైల్లో లాక్‌డౌన్..
Follow us on

lockdown at Aurangabad jail: కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పుడు భారత్ లో కూడా విజృంభిస్తోంది. ఈ క్రమంలో ఔరంగాబాద్‌ జైలులో లాక్‍డౌన్ విధిస్తున్నట్టు మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రకటించారు. జైలు నుంచి బయటకు వెళ్లడం, బయట నుంచి జైలులోకి రావడానికి ఎవరినీ అనుమతించమని దేశ్‌ముఖ్ ఆదివారంనాడు తెలిపారు. పోలీసు సిబ్బందికి ఆహారం, బస ఏర్పాట్లు జైలులోనే ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.

మరోవైపు.. కోవిడ్-19ను దృష్టిలో ఉంచుకుని గత వారంలోనే ముంబై, పుణెలోని ఐదు జైళ్లలో పూర్తి లాకౌట్‌ను మహారాష్ట్ర హోం శాఖ ప్రకటించింది. ముంబై సెంట్రల్ జైల్, థానే జైలు, యరవాడ జైలు, బైకుల్లా జైలు, కల్యాణ్ జైలు ఇందులో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 3,651 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 365 మంది పేషెంట్లు పూర్తిగా కోలుకున్నారు. 211 మరణాలు సంభవించాయి.

Also Read: థియేటర్లు బంద్.. ఓటీటీల హవా..