AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మహా’ పోలీసుల్లో కరోనా కలవరం.. ఇవాళ 311 మందికి పాజిటివ్

మహారాష్ట్రలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడంలేదు. దేశంలోనే అత్యధిక కేసులతో మొదటిస్థానంలో కొనసాగుతున్న మహారాష్ట్రలో కరోనాతో పోరాడుతున్న ఫ్రంట్ వారియర్స్ సైతం వైరస్ కాటుకు గురవుతున్నారు.

‘మహా’ పోలీసుల్లో కరోనా కలవరం.. ఇవాళ 311 మందికి పాజిటివ్
Balaraju Goud
|

Updated on: Sep 14, 2020 | 4:43 PM

Share

మహారాష్ట్రలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడంలేదు. దేశంలోనే అత్యధిక కేసులతో మొదటిస్థానంలో కొనసాగుతున్న మహారాష్ట్రలో కరోనాతో పోరాడుతున్న ఫ్రంట్ వారియర్స్ సైతం వైరస్ కాటుకు గురవుతున్నారు. కొవిడ్ బారిన పడుతున్న పోలీసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ప్రతిరోజు వందల సంఖ్యలో కొత్తగా కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 311 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా బారినపడిన పోలీసుల సంఖ్య 19,385కు చేరుకుంది. మరోవైపు, కరోనా సోకిన పోలీసుల్లో 15,521 మందికి కోలుకుని క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారు. ఇందులో 3,670 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కాగా గత 24 గంటల్లో కరోనాను జయించలేక ఐదుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైరస్ కారణంగా చనిపోయిన పోలీసుల సంఖ్య 194కి చేరింది. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పోలీసులు అత్యధిక సంఖ్యలో కరోనా వైరస్ బారిన పడుతున్నారు. వీరి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. ఇక, మహారాష్ట్రలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 లక్షలు దాటగా 29,115 మంది కరోనా కాటుకు బలయ్యారు.

Follow Us
రామ్ చరణ్‌ సర్జరీ సక్సెస్.. బెడ్ రెస్ట్ ఎన్ని రోజులంటే?
రామ్ చరణ్‌ సర్జరీ సక్సెస్.. బెడ్ రెస్ట్ ఎన్ని రోజులంటే?
వందల కోట్ల సంవత్సరాలకూ.. ఏ తేదీ అడిగినా ఏ వారమో చిటికెలో చెప్తా!
వందల కోట్ల సంవత్సరాలకూ.. ఏ తేదీ అడిగినా ఏ వారమో చిటికెలో చెప్తా!
ఇద్దరు ఆటగాళ్లు + 10 కోట్లు.. ఐపీఎల్ హిస్టరీలోనే భారీ ట్రేడ్‌?
ఇద్దరు ఆటగాళ్లు + 10 కోట్లు.. ఐపీఎల్ హిస్టరీలోనే భారీ ట్రేడ్‌?
మీరు వాడుతున్న కుంకుమపువ్వు అసలైనదేనా? ఇలా చెక్ చేయండి!
మీరు వాడుతున్న కుంకుమపువ్వు అసలైనదేనా? ఇలా చెక్ చేయండి!
జీప్ మెరిడియన్ 85వ యానివర్సరీ ఎడిషన్ SUV స్పెషాలిటీస్
జీప్ మెరిడియన్ 85వ యానివర్సరీ ఎడిషన్ SUV స్పెషాలిటీస్
కలలో జుట్టు కత్తిరించుకున్నట్లు కనిపించిందా? ఇది శుభమా? అశుభమా?
కలలో జుట్టు కత్తిరించుకున్నట్లు కనిపించిందా? ఇది శుభమా? అశుభమా?
‘మిషన్ శక్తిశాట్’కి ఎంపికైన ఏకైక AP విద్యార్థిని జెస్సీ..
‘మిషన్ శక్తిశాట్’కి ఎంపికైన ఏకైక AP విద్యార్థిని జెస్సీ..
హోండా నుంచి సరికొత్త ఫ్లెక్స్-ఫ్యూయల్ స్కూటర్.. విశేషాలివే
హోండా నుంచి సరికొత్త ఫ్లెక్స్-ఫ్యూయల్ స్కూటర్.. విశేషాలివే
మంగళవారం వాతావరణం ఎలా ఉంటుంది..?
మంగళవారం వాతావరణం ఎలా ఉంటుంది..?
చావు అంచులవరకు వెళ్లిన జబర్దస్త్ జీవన్ ను కాపాడిందెవరో తెలుసా?
చావు అంచులవరకు వెళ్లిన జబర్దస్త్ జీవన్ ను కాపాడిందెవరో తెలుసా?