బురదలో ఇరుక్కుపోయిన సీఎం హెలికాప్టర్​ చక్రాలు..పైలట్ ఏం చేశాడంటే?

| Edited By:

Oct 12, 2019 | 12:40 PM

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పుణెలోని రాయగఢ్‌ జిల్లాలో శుక్రవారం ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ల్యాండ్‌ అవుతుండగా కుదుపులకు లోనైంది. తొలుత పైలట్‌ హెలికాప్టర్‌పై నియంత్రణ కోల్పోయినా, కొన్ని సెకన్ల వ్యవధిలోనే సురక్షితంగా దింపారని చెప్పారు. ఆ సమయంలో ఫడ్నవీస్‌తోపాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు, ఓ ఇంజినీర్‌, పైలట్‌, కో పైలట్‌ హెలికాప్టర్‌లో ఉన్నారు. అహ్మద్​నగర్ జిల్లా కర్జాత్​లో బహిరంగ సభ ముగిసిన అనంతరం రాయ్​గఢ్​లోని పెన్​ సమావేశానికి బయలుదేరారు ఫడ్నవీస్​. పెన్​ […]

బురదలో ఇరుక్కుపోయిన సీఎం హెలికాప్టర్​ చక్రాలు..పైలట్ ఏం చేశాడంటే?
Follow us on

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పుణెలోని రాయగఢ్‌ జిల్లాలో శుక్రవారం ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ల్యాండ్‌ అవుతుండగా కుదుపులకు లోనైంది. తొలుత పైలట్‌ హెలికాప్టర్‌పై నియంత్రణ కోల్పోయినా, కొన్ని సెకన్ల వ్యవధిలోనే సురక్షితంగా దింపారని చెప్పారు. ఆ సమయంలో ఫడ్నవీస్‌తోపాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు, ఓ ఇంజినీర్‌, పైలట్‌, కో పైలట్‌ హెలికాప్టర్‌లో ఉన్నారు. అహ్మద్​నగర్ జిల్లా కర్జాత్​లో బహిరంగ సభ ముగిసిన అనంతరం రాయ్​గఢ్​లోని పెన్​ సమావేశానికి బయలుదేరారు ఫడ్నవీస్​. పెన్​ బోర్గావ్​ వద్ద దిగుతుండగా హెలిప్యాడ్ బురదగా ఉన్న కారణంగా ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదం నుంచి ముఖ్యమంత్రి సహా అందరూ క్షేమంగా బయటపడ్డారని జిల్లా ఎస్పీ అనిల్‌ పరాస్కర్‌ తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహా జనదేశ్‌ సంకల్ప్‌ సభలో పాల్గొనేందుకు ఫడ్నవీస్‌ రాయగఢ్‌ వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.

2017లోనూ ఫడ్నవీస్ హెలికాప్టర్‌ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. లాతూర్‌లో హెలికాప్టర్‌ టేకాఫ్‌ అయిన కాసేపటికే సాంకేతిక లోపం తెలెత్తింది. ఈ సమయంలో అందులో ఆరుగురు ఉన్నారు. వెంటనే పైలట్‌ కిందికి దింపుతుండగా హెలికాప్టర్‌ రెక్కలు విద్యుత్‌ వైర్లలో చిక్కుకున్నాయి. హెలికాప్టర్‌ మొత్తం దెబ్బతిన్నా… అదృష్టవశాత్తు సీఎం సహా ఆరుగురికీ ఎలాంటి గాయాలూ కాలేదు.