Vidura Niti: మనిషిలో ఈ లక్షణాలుంటే నేరుగా నరకానికి పోతారట.. అందుకనే వీటిని వదిలించుకోమంటున్న విదురుడు

|

Sep 14, 2021 | 8:50 AM

Mahabharata Vidura Niti: మారుతున్న కాలాన్ని బట్టి కొన్ని నీతుల గురించి అభిప్రాయాలూ మారుతున్నాయి. కొన్ని మాత్రం యుగాలు మారినా మారవు. ఎప్పటికీ మనిషి జీవితానికి, సమాజానికి ఉపయోగపడే నీతులు..

Vidura Niti: మనిషిలో ఈ లక్షణాలుంటే నేరుగా నరకానికి పోతారట.. అందుకనే వీటిని వదిలించుకోమంటున్న విదురుడు
Vidura
Follow us on

Mahabharata Vidura Niti: మారుతున్న కాలాన్ని బట్టి కొన్ని నీతుల గురించి అభిప్రాయాలూ మారుతున్నాయి. కొన్ని మాత్రం యుగాలు మారినా మారవు. ఎప్పటికీ మనిషి జీవితానికి, సమాజానికి ఉపయోగపడే నీతులు, మార్గదర్శకాలను పురాణాలు వేదశాస్త్రాలతో పాటు విదురనీతి, చాణక్యనీతి వంటివి తెలుపుతాయి. ఇక ఒక దాసికి, వ్యాసుడికి జన్మించిన విదురుడు.. ధృతరాష్ట్రుడికి తోడుగా ఉంటూ హితోక్తులు చెబుతూ, పాండవుల మేలు కోరుతూ ఉండే కృష్ణభక్తుడు. రాయబారానికి శ్రీకృష్ణుడు వెళ్ళినప్పుడు ఎవరి ఇంట్లోనూ భోజనానికి అంగీకరించడు. విదురుడి ఆహ్వానాన్ని మన్నించి  విదురుడు ఇంటికి మాత్రం వెళ్ళాడు. విదురుడు భక్తితో స్వయంగా తానే కృష్ణుడికి ఆహారం తినిపించాడు. భక్తి పారవశ్యంతో ఒడలు మరచి, అరటిపండు తొక్క ఒలిచి దాన్నే కృష్ణుడి నోటికి అందించి, లోపలి పదార్థాన్ని పారవేశాడు..  విదురుడి నిర్మల భక్తికి ఇది నిదర్శనం. అంతటి విదురుడు చెప్పిన నీతులు నేటి మానవునికి అనుచరణీయం.

కలియుగంలో శాస్త్రాలప్రకారం మనిషి సగటు వయసు నూరేళ్లు. అయితే మనిషి ఆలోచనలు, జీవిస్తున్న తీరు, అన్ని కలిపి ప్రస్తుతం మనిషి ఆయుఃప్రమాణం 60 ఏళ్లకి తగ్గిపోయింది. దీనికి మనిషి చేసుకున్న స్వయంకృతాపరాధమే అని చెప్పవచ్చు.  స్వార్ధం, అసూయ, ద్వేషాలతో పాటు మారుతున్న అలవాట్లు ఇవన్నీ మనిషి బతికి ఉండగానే నరకానికి చేరుకుంటున్నారు. నేరుగా నరకానికి చేరుకుంటున్నారు. అయితే కొన్ని పనులు చేస్తే మరణాన్ని కోరి తెచ్చుకున్నట్లేనని దృతరాష్ట్రుడునికి విదురుడు చెప్పాడు.

కొంతమంది తమను తాము చాలా గొప్పవారిగా ఊహించుకుని.. ఎదుటివారిని తక్కువగా, చులకనగా చూస్తారని.. అలాంటి వారి జీవితంలో విలువైంది ఏది ఉండదు.. ఇక చావుకు దగ్గరగా ఉంటారు. ఇతరులకు సేవ చేయనివారు,  ఎదుటివారికి సహాయపడనివారు  నేరుగా నరకానికి పోతరాట. ఎదుటివాళ్లను గౌరవించని వ్యక్తి మానవ జీవితానికి పనికిరాడట. కొంతమంది ఇతరుల గురించి తప్పుగా మాట్లాడతారు, చేదుగా ప్రచారం చేస్తారు.. ఇలాంటివారిని మృత్యువు వెంటాడుతుంది. మనిషి దుర్గుణాల్లో ఒకటి కోపం… ఎటువంటి కారణం లేకుండా ఇతరులపై ఆగ్రహం వ్యక్తం చేసేవారు నేరుగా నరకానికి వెళ్లారట.. అందుకనే పెద్దలు తనకోపమే తన శత్రువు అని అంటారు.  తనకు కష్టసుఖాల్లో ఉండే కుటుంబాన్ని, స్నేహితులను మోసం చేసినవారికి నరక ద్వారాలు తెరచి ఉంటాయట. అందుకనే స్నేహితుల పట్ల నిజాయతీ, కుటుంబ సభ్యులపట్ల ప్రేమాదరణతో ఉండాలి.  ఇక తన స్వార్ధం చూసుకుంటూ.. అసూయ, స్వార్ధం వంటి దుర్గుణాలతో ఉన్నవారికి నరకం స్వాగతం పలుకుతుందట.

ఈ పై లక్షణాలను మనిషి విడిచి పెడితే.. జీవితంలో విజయం సాధించడమే కాదు.. ఆర్ధికంగా మంచి స్టేజ్ కు చేరుకుంటారు. మానసికంగా సంతోషంగా ఉంటారు.

Also Read:

: నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్.. ఆలయ తుదిదశ పనుల పరిశీలన..