అధికారుల వేధింపులకు.. రాళ్లతో ఖైదీల జవాబు..

తమిళనాడులోని మధురై సెంట్రల్ జైలులో సిబ్బందిపై ఖైదీల రాళ్లదాడి తీవ్ర సంచలనం రేపింది. జైలు కాంపౌండ్ వాల్ ఎక్కిన ఖైదీలు సిబ్బందిపై రాళ్లతో దాడి చేశారు. జైలు సిబ్బంది వేధింపులు ఎక్కువయ్యాయని ఖైదీలు ఆరోపిస్తున్నారు. రాళ్లదాడిలో పలువురు జైలు సిబ్బందికి గాయాలయ్యాయి. గతంలో కూడా ఇవే ఆరోపణలపై ఖైదీలు ఆందోళనలు చేశారు. అయినప్పటికీ సిబ్బందిలో మార్పు రాలేదని అంటున్నారు. ప్రతి రోజూ తనిఖీల పేరుతో వేధిస్తున్నారని ఖైదీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీల కోసం పోలీసులకు వ్యతిరేకంగా […]

అధికారుల వేధింపులకు.. రాళ్లతో ఖైదీల జవాబు..

Edited By:

Updated on: Apr 24, 2019 | 8:12 PM

తమిళనాడులోని మధురై సెంట్రల్ జైలులో సిబ్బందిపై ఖైదీల రాళ్లదాడి తీవ్ర సంచలనం రేపింది. జైలు కాంపౌండ్ వాల్ ఎక్కిన ఖైదీలు సిబ్బందిపై రాళ్లతో దాడి చేశారు. జైలు సిబ్బంది వేధింపులు ఎక్కువయ్యాయని ఖైదీలు ఆరోపిస్తున్నారు. రాళ్లదాడిలో పలువురు జైలు సిబ్బందికి గాయాలయ్యాయి.

గతంలో కూడా ఇవే ఆరోపణలపై ఖైదీలు ఆందోళనలు చేశారు. అయినప్పటికీ సిబ్బందిలో మార్పు రాలేదని అంటున్నారు. ప్రతి రోజూ తనిఖీల పేరుతో వేధిస్తున్నారని ఖైదీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీల కోసం పోలీసులకు వ్యతిరేకంగా జైలు గోడ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో మధురై సెంట్రల్ జైలు దగ్గరకు అదనపు బలగాలను తరలించారు.