అదనపు డీజీ పురుషోత్తంపై చర్యలు..

|

Sep 28, 2020 | 2:47 PM

అదనపు డీజీ పురుషోత్తం శర్మను సప్పెండ్ చేసింది మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం. భార్యను కొట్టిన వీడియో వైరలవడంతో అతనిపై చర్యలు తీసుకుంది. తన వివాహేతర సంబంధాన్ని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుందన్న కారణంతో.. ఆమెను చావబాదాడు పురుషోత్తం.

అదనపు డీజీ పురుషోత్తంపై చర్యలు..
Follow us on

Taken Action Against Additional DG : అదనపు డీజీ పురుషోత్తం శర్మను సప్పెండ్ చేసింది మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం. భార్యను కొట్టిన వీడియో వైరలవడంతో అతనిపై చర్యలు తీసుకుంది. తన వివాహేతర సంబంధాన్ని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుందన్న కారణంతో.. ఆమెను చావబాదాడు పురుషోత్తం. కిందపడేసి విచక్షణారహితంగా ఆమెపై దాడి చేశాడు. సీసీ ఫుటేజ్‌లో రికార్డైన ఆ వీడియో వైరల్‌గా మారింది.

అయితే ఈ ఘటనపై వివరణ ఇచ్చుకున్నాడు అదనపు డీజీ పురుషోత్తం. పెళ్లై 32 ఏళ్లైందని.. 2008లో నాపై నా భార్య ఫిర్యాదు చేసిందన్నారు. ఆ తర్వాత కూడా ఆమె నా ఇంట్లోనే ఉందని.. నా ఖర్చులతోనే విదేశీ ప్రయాణాలు చేసిందన్నారు. తనది దాడి చేసే వ్యక్తిత్వం కాదని సమర్థించుకున్నారు. కేవలం ఇది కుటుంబ తగాదా అని.. నా దురదృష్టవశాత్తూ ఈ పరిస్థితొచ్చిందన్నారు. నా భార్య ఇంట్లో కెమెరాలు పెట్టి నన్ను రెచ్చగొట్టిందని ఆరోపించారు.

మధ్యప్రదేశ్ అదనపు డీజీగా ఉన్న పురుషోత్తం శర్మపై.. గతంలో హనీ ట్రాప్ కేసులో ఆరోపణలున్నాయి. ప్రస్తుతం పురుషోత్తం శర్మ మరో మహిళతో ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా ఆయన భార్య పట్టుకున్నారు. దీంతో రగిలిపోయిన శర్మ.. భార్యను తీవ్రంగా కొట్టారు. తన పర్సనల్‌ విషయాల్లో జోక్యం చేసుకోవద్దంటూ భార్యను బెదిరించారు.
ఇంట్లోని సిబ్బంది ఆపడానికి ప్రయత్నించినా భార్యను కింద పడేసి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో పురుషోత్తం శర్మ చేతికి కూడా గాయమైంది.