‘మా’లో మారని పరిస్థితులు! న్యాయం చేయాలని జీవిత డిమాండ్!

| Edited By:

Jan 06, 2020 | 6:52 PM

మాలో పరిస్థితులు మారినట్లు కనిపించడం లేదు. పైపైకి వాతావరణం చల్లబడినట్లు కనిపిస్తున్నా.. లోలోపల మాత్రం అగ్నిపర్వతాలు పేలుతున్నట్లుంది ‘మా’ పరిస్థితి. ఈ నెల 2న జరిగిన మా డైరీ ఆవిష్కరణ‌ కార్యక్రమం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. స్టేజ్‌పై చిరంజీవితో సహా పలువురు నటులు మాట్లాడుతున్నప్పుడు.. హీరో రాజశేఖర్ మైక్‌ లాక్కోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో.. అక్కడున్న నటులందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీంతో.. అనంతరం జీవిత మాట్లాడుతూ.. వారితో మాకేమీ విభేదాలు లేవని.. రాజశేఖర్‌ది […]

మాలో మారని పరిస్థితులు! న్యాయం చేయాలని జీవిత డిమాండ్!
Follow us on

మాలో పరిస్థితులు మారినట్లు కనిపించడం లేదు. పైపైకి వాతావరణం చల్లబడినట్లు కనిపిస్తున్నా.. లోలోపల మాత్రం అగ్నిపర్వతాలు పేలుతున్నట్లుంది ‘మా’ పరిస్థితి. ఈ నెల 2న జరిగిన మా డైరీ ఆవిష్కరణ‌ కార్యక్రమం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. స్టేజ్‌పై చిరంజీవితో సహా పలువురు నటులు మాట్లాడుతున్నప్పుడు.. హీరో రాజశేఖర్ మైక్‌ లాక్కోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో.. అక్కడున్న నటులందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీంతో.. అనంతరం జీవిత మాట్లాడుతూ.. వారితో మాకేమీ విభేదాలు లేవని.. రాజశేఖర్‌ది చిన్నపిల్లల మనస్తత్వం అని చెప్పారు. ఆ తరువాత అదే రోజు సాయంత్రం మా ఎగ్జిగ్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజశేఖర్ ‘మా’కి రాజీనామా చేశారు. ఇక్కడి వరకూ అంతా బాగానే జరిగింది.

అయితే.. ఆదివారం రాజశేఖర్ చేసిన రాజీనామాకి ‘మా’ ఆమోదం తెలిపింది. దీంతో మళ్లీ అగ్గిరాజుకుంది. వారి మనసుల్లో ఏమీ లేకపోతే.. రాజశేఖర్ చేసిన రాజీనామాకి ‘మా’ ఎలా ఒప్పుకుంటుంది అనే ప్రశ్న తలెత్తుతోంది. తాజాగా.. దీనిపై జీవిత మాట్లాడుతూ.. హీరో రాజశేఖర్ పర్సనల్ కారణాల చేత రాజీనామా చేయలేదని.. కేవలం ‘మా’ ప్రెసిడెంట్ నరేష్ వ్యహరశైలి నచ్చకే పదవికి రాజీనామా చేసారని ఆమె పేర్కొన్నారు. నరేష్ వ్యవహార శైలిపై అనేక సార్లు బహిరంగంగా మాట్లాడినా.. సభ్యులు చర్యలు తీసుకోకపోవడం వల్లే రాజశేఖర్ అలా మాట్లాడాల్సివచిందన్నారు. కాగా.. మాలో క్రమశిక్షన కమిటీ ఏర్పాటు చేశారు. సీనియర్ నటులు క్రమ శిక్షణ కమిటీ ద్వార న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తర్వాత హీరో రాజశేఖర్ స్పందిస్తారని జీవిత తెలిపారు. అయితే.. నరేష్‌పై కమిటీ ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూస్తున్నామని జీవిత పేర్కొన్నారు.