తమన్నా, సత్యదేవ్‌ల ‘గుర్తుందా శీతాకాలం‌’..

|

Aug 24, 2020 | 8:53 PM

'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న హీరో సత్యదేవ్ తన తదుపరి చిత్రాన్నిమొదలుపెట్టాడు. కన్నడంలో హిట్ అయిన ‘లవ్‌ మాక్‌టైల్‌’ మూవీ తెలుగు రీమేక్ లో నటించనున్నాడు.

తమన్నా, సత్యదేవ్‌ల ‘గుర్తుందా శీతాకాలం‌’..
Follow us on

Love Mocktail Telugu Remake: ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న హీరో సత్యదేవ్ తన తదుపరి చిత్రాన్నిమొదలుపెట్టాడు. కన్నడంలో హిట్ అయిన ‘లవ్‌ మాక్‌టైల్‌’ మూవీ తెలుగు రీమేక్ లో నటించనున్నాడు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ‘గుర్తుందా శీతాకాలం’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు కన్నడ దర్శకుడు నాగశేఖర్‌ దర్శకత్వం వహించనున్నాడు.

Also Read: బాలకృష్ణ గొప్ప మనసు.. కోవిడ్ ఆసుపత్రికి భారీ విరాళం..

కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానుంది. కీరవాణి తనయుడు కాలభైరవ ఈ మూవీకి సంగీతం అందించనున్నాడు. ఈ సినిమాతో సత్య దేవ్, తమన్నాలు మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటంతో.. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఉత్కంఠ నెలకొంది.

Also Read: ఢిల్లీ టూ లండన్.. బస్సులో అడ్వెంచర్ జర్నీ..