జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తర్వాత బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలిచి పట్టు సాధించింది. దుబ్బాక గెలుపుతో మంచి ఊపుమీదున్న బీజేపీ అనుకున్నట్లుగానే గ్రేటర్‌లో విజయ ఢంకా మోగించింది. 2016 గ్రేటర్ ఎన్నికల్లో 4 స్థానాలకే పరిమితమైన బీజేపీ ప్రస్తుతం జరిగిన బల్దియా ఎన్నికల్లో 48 స్థానాల్లో గెలిచి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ పరిణామంతో మేయర్ పీటానికి గట్టి పోటీ ఎదురైంది. అంతేకాకుండా తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రధాన ప్రతిపక్షం తామే అంటూ చెప్పకనే చెప్పింది. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ అభ్యర్థుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
అడిక్‌మెట్ సి.సునీత ప్రకాశ్ గౌడ్, అత్తాపూర్ ఎం. సంగీత, అమీర్‌పేట కేతినేని సరళ, ఐఎస్ సదన్ జె. శ్వేత, కవాడిగూడ జి.రచనశ్రీ, కాచిగూడ కె. ఉమారాణి, కొత్తపేట ఎన్.పవన్ కుమార్, గచ్చిబౌలి వి.గంగాధర్ రెడ్డి, గడ్డి అన్నారం బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, గన్‌పౌండ్రీ బి.సురేఖ, గాంధీనగర్ ఎ.పావని, గుడి మల్కాపూర్ దేవర కరుణాకర్, గోషామహల్ లాల్ సింగ్, గౌలిపురా ఎ.భాగ్యలక్ష్మి, చంపాపేట వంగ మధుసూదన్ రెడ్డి, చైతన్యపురి రంగ వెంకట నరసింహారావు, జాంబాగ్ రాకేశ్ జైశ్వాల్, జియాగూడ బి.దర్శన్, జీడిమెట్ల సి.హెచ్. తారచంద్రారెడ్డి, జూబ్లీహిల్స్ డి. వెంకటేశ్, నల్లకుంట వై. అమృత, నాగోల్ సి.హెచ్. అరుణ, బాగ్‌అంబర్ పేట బి.పద్మావెంకట్ రెడ్డి, బీఎన్‌రెడ్డి నగర్ ఎం.లచ్చిరెడ్డి, బేగం బజార్ జి.శంకర్ యాదవ్, మంగళ్ హాట్ ఎం.శశికళ, మన్సూరాబాద్ కొప్పుల నరసింహారెడ్డి, మల్కాజిగిరి వి. శ్రవణ్, ముషీరాబాద్ ఎం. సుప్రియ, మూసాపేట కె. మహేందర్, మూసారంబాగ్ బి. భాగ్యలక్ష్మి, మైలార్ దేవ్ పల్లి టి. శ్రీనివాస్ రెడ్డి, మోండా మార్కెట్ కొంతం దీపిక, మౌలాలి గున్నాల సునీత, రాంగోపాల్ పేట సి.హెచ్ సుచిత్ర, రాంనగర్ కె.రవికుమార్, రాజేంద్రనగర్ పి. అర్చన, రామంతాపూర్ బండారి శ్రీవాణి, రామకృష్ణాపురం వి.రాధ, లింగోజి గూడ ఆకుల రమేశ్ గౌడ్, వనస్థలిపురం ఆర్. వెంకటేశ్వర్ రెడ్డి, వినాయక్‌నగర్ సి.రాజ్యలక్ష్మి, సరూర్ నగర్ ఆకుల శ్రీవాణి, సైదాబాద్ కె. అరుణ, హబ్సిగూడ కె. చేతన, హయత్‌నగర్ కె.నవజీవన్ రెడ్డి, హస్తినాపురం బానోత్ సుజాత, హిమాయత్ నగర్ జి.ఎన్.వి. కె మహాలక్ష్మిలు గెలుపొందారు.