గుంటూరు లాక్‌డౌన్ : నిబంధనలు ఇవే

|

Jul 16, 2020 | 8:30 PM

ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఇక గుంటూరు జిల్లాలో రోజు రోజుకి కోవిడ్-19 కేసులు గణనీయంగా పెరుగుతూనే ఉన్నాయి. జిల్లాలో విజృంభన ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు, జిల్లాలో ప్రస్తుతం ఇప్పటి వరకు నమోదైన కరోన కేసుల సంఖ్య 5000 పైచిలుకు కాగా వారిలో 1829 మనది కరోన మహమ్మరిని జయించారు, ఇప్పటికీ 32 మంది కరోనాకు బలి అయ్యారు. […]

గుంటూరు లాక్‌డౌన్ : నిబంధనలు ఇవే
Follow us on

ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఇక గుంటూరు జిల్లాలో రోజు రోజుకి కోవిడ్-19 కేసులు గణనీయంగా పెరుగుతూనే ఉన్నాయి. జిల్లాలో విజృంభన ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు, జిల్లాలో ప్రస్తుతం ఇప్పటి వరకు నమోదైన కరోన కేసుల సంఖ్య 5000 పైచిలుకు కాగా వారిలో 1829 మనది కరోన మహమ్మరిని జయించారు, ఇప్పటికీ 32 మంది కరోనాకు బలి అయ్యారు.

శనివారం నుంచి జిల్లా వ్యాప్తంగా పూర్తి లాక్ డౌన్ అమలలో ఉంటుందని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. ఉదయం 6 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు మాత్రమే నిత్యవసర సరకుల కొనుగోళుకు అనుమతి ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. కరోనా నియంత్రణలో భాగంగా శనివారం నుంచి వారం రోజుల పాటు పూర్తి లాక్ డౌన్ అమలులో ఉంటుందని తెలిపారు. అత్యవసరం అయితేనే ప్రజలు బయటకు రావాలని సూచించారు.

కరోనా కట్టడిలో భాగంగా మాస్క్ తప్పని సరిగా ధరించాలని… సామాజిక దూరం పాటిస్తూ.. శానిటైజర్లు వియోగించాలని జిల్లా ప్రజలకు కలెక్టర్ సూచనలు జారీ చేశారు. కరోనా నియంత్రణ కు సహకరించాలని ఆయన జిల్లా ప్రజలకు కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.