చెన్నై మహానగరంలో ఉన్న మద్యం ప్రియులకు శుభవార్త వచ్చేసింది. రేపటి నుంచి చెన్నై సిటీలో మద్యం అమ్మకాలు ప్రారంభించాలని తమిళనాడు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఐదు నెలలపాటు చెన్నైలో మద్యం విక్రయాలపై నిషేధం విధించింది ప్రభుత్వం. ఇక రేపటి నుంచి చెన్నై సిటీలో మద్యం విక్రయాలకు అనుమతివ్వడంతో మద్యం కొనుగోళ్లు భారీ స్థాయిలో జరిగే అవకాశం ఉంది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయని, టోకెన్ విధానం ద్వారా ప్రతి రోజు 500 మందికి మాత్రమే ప్రతి షాపులో సేవలు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. మాస్కలు, భౌతిక దూరం తప్పనిసరి అని పేర్కొంది. మాల్స్, కంటెన్‌మెంట్ జోన్స్‌లోని లిక్కర్ షాపులు మూసివేసే ఉంటాయని తెలిపింది. గ్రేటర్ చెన్నై పోలీసుల పరిధిలోని మద్యం దుకాణాలు మాత్రమే తెరుస్తున్నారు.
TASMAC shops to reopen in Chennai from August 18. pic.twitter.com/MGL7WjoNgt
— AIADMK (@AIADMKOfficial) August 16, 2020
Also Read :
పబ్జీ ఆడేందుకు ఫోన్ ఇవ్వలేదని బ్లేడ్‌తో గొంతు కోసుకున్నాడు