రాఫెల్ యుద్ధ విమానాల రాకపై ఎంఎస్ ధోని ఎమన్నారంటే…

|

Sep 10, 2020 | 3:47 PM

రాఫేల్ యుద్ధ విమానాల రాకతో భారత వాయు సేన (ఐఏఎఫ్) సామర్థ్యం మరింత పెరిగిందని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సంతోషం వ్యక్తం చేశారు. భారత వాయు సేన పైలట్ల చేతుల్లో ‘ప్రబల శక్తిగల పక్షుల’ విధ్వంసకర, ప్రాణాంతక, మట్టుబెట్టే సత్తా మరింత పెరుగుతుందంటూ సోషల్ వేదికగా షేర్ చేశారు.

రాఫెల్ యుద్ధ విమానాల రాకపై ఎంఎస్ ధోని ఎమన్నారంటే...
Follow us on

రాఫేల్ యుద్ధ విమానాల రాకతో భారత వాయు సేన (ఐఏఎఫ్) సామర్థ్యం మరింత పెరిగిందని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సంతోషం వ్యక్తం చేశారు. భారత వాయు సేన పైలట్ల చేతుల్లో ‘ప్రబల శక్తిగల పక్షుల’ విధ్వంసకర, ప్రాణాంతక, మట్టుబెట్టే సత్తా మరింత పెరుగుతుందంటూ సోషల్ వేదికగా షేర్ చేశారు.

హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ నుంచి ఐదు రఫేల్ యుద్ధ విమానాలను లాంఛనంగా వాయు సేనలోకి ప్రవేశపెట్టారు. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఫ్రెంచ్ కౌంటర్ ఫ్లోరెన్స్ పార్లీతో కలిసి అంబాలా ఈ లాంఛనంగా సర్వమత పూజల అనంతరం నింగిలోకి చేరుకున్నాయి. ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంపై స్పందించిన భారత సైన్యం గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ ఎంఎస్ ధోనీ ఇచ్చిన ట్వీట్‌లో తన ఉత్సాహాన్ని పంచుకున్నారు.

‘‘తుది ప్రవేశ కార్యక్రమంతో ప్రపంచపు అత్యుత్తమ యుద్ధ విమానంగా నిరూపితమైన 4.5 జనరేషన్ ఫైటర్ ప్లేన్ ప్రపంచపు అత్యుత్తమ ఫైటర్ పైలట్ల చేతుల్లోకి వస్తుంది. మన పైలట్ల చేతుల్లో, ఐఏఎఫ్‌లోని వేర్వేరు విమానాల కలయికతో ప్రబల శక్తిగల పక్షుల ప్రాణాంతక, విధ్వంసకర సామర్థ్యం పెరుగుతుంది’’ అని ధోనీ ఓ ట్వీట్‌లో సంతోషం పంచుకున్నారు.

‘‘ప్రతిష్ఠాత్మక 17 స్క్వాడ్రన్ బంగారు బాణాలకుకు శుభాకాంక్షలు తెలుపుతూ, మిరేజ్ 2000 సర్వీస్ రికార్డును రఫేల్ అధిగమించాలని మనమంతా ఆశిద్దామంటూ పేర్కొన్నారు ధోని. అయితే, ఎస్‌యూ30ఎంకేఐ నాకు ప్రీతిపాత్రమైనదన్న ధోని.. బాయ్స్‌కి భీకర పోరుకు కొత్త లక్ష్యం సమకూరిందని, సూపర్ సుఖోయ్‌గా అప్‌గ్రేడ్ అయ్యే వరకు బీవీఆర్ ఎంగేజ్‌మెంట్‌ కోసం ఎదురుచూడాలంటూ మరొక ట్వీట్‌లో ధోని పేర్కొన్నారు.

కాగా, ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన పోరాట జెట్లలో ఒకటైన రాఫెల్ ను ప్రవేశపెట్టడం వల్ల బారత వాయుసేన మరింత బలంగా తయారైంది.