Leopard Attack on Two Wheelers in Tirumala : తిరుమలలో మరోసారి చిరుత దాడి కలకలం సృష్టించింది. తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో 9వ కిలో మీటర్ వద్ద ద్విచక్ర వాహనదారులపై చిరుత దాడి చేసింది. దీని నుంచి ఇద్దరు ట్రాఫిక్ కానిస్టేబుళ్లు, కర్నాటకకు చెందిన భక్తుడు తృటిలో తప్పించుకున్నారు. రెండు మూడు ప్రాంతాల్లో డివైడర్‌పై మాటువేసి దాడికి దిగింది. చిరుత కోసం అటవీశాఖ అధికారులు గాలింపు చేపట్టారు.
అయితే గతంలోనూ ఇదే ప్రాంతంలో చిరుత కనిపించింది. కానీ ఇప్పుడు దాడి చేయడం సంచలనంగా మారింది. అడవుల నుంచి వన్య మృగాలు కొండపైకి రావడం సర్వసాధారణమైంది. తిరుమల క్షేత్రం దట్టమైన శేషాచలం అడవుల్లో ఉందుకు ఓ కారణం.. కాగా.. లాక్‌డౌన్ సమయంలో జన సంచారం లేకపోవడంతో అడవి జంతువులు తిరుమల కొండపై ప్రత్యక్షమయ్యాయి. అయితే ఆ తర్వాత అన్ లాక్ సమయంలోనూ జనాలు తిరుగుతున్నా.. అప్పుడప్పుడూ చిరుతలు ప్రత్యక్షమవుతున్నాయి.