మున్సిపల్ ఎన్నిక ఫలితాలు.. దూసుకుపోతున్న ‘కారు’..

|

Jan 25, 2020 | 11:22 AM

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఓట్లు లెక్కింపు కోసం అధికారులు 2,619 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొదటిగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి.. ఆ తర్వాత బ్యాలెట్ బాక్సులను లెక్కిస్తారు. ఇక సమాన ఓట్లు వస్తే.. అభ్యర్థిని లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నారు. ఇదిలా ఉండగా మున్సిపల్ ఫలితాల్లో టీఆర్ఎస్ జోరు చూపిస్తోంది. పరకాల, చెన్నూరు, సిరిసిల్ల, బొల్లారం, హుజురాబాద్, జవహర్‌నగర్ మున్సిపాలిటీలను పూర్తిగా ఆ పార్టీ కైవసం చేసుకుంది. […]

మున్సిపల్ ఎన్నిక ఫలితాలు.. దూసుకుపోతున్న కారు..
Follow us on

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఓట్లు లెక్కింపు కోసం అధికారులు 2,619 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొదటిగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి.. ఆ తర్వాత బ్యాలెట్ బాక్సులను లెక్కిస్తారు. ఇక సమాన ఓట్లు వస్తే.. అభ్యర్థిని లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నారు.

ఇదిలా ఉండగా మున్సిపల్ ఫలితాల్లో టీఆర్ఎస్ జోరు చూపిస్తోంది. పరకాల, చెన్నూరు, సిరిసిల్ల, బొల్లారం, హుజురాబాద్, జవహర్‌నగర్ మున్సిపాలిటీలను పూర్తిగా ఆ పార్టీ కైవసం చేసుకుంది. చెన్నూరులో మొత్తం 18 వార్డులను.. అలాగే పరకాలలోని 22 వార్డులలో విజయకేతనం ఎగరవేసింది. కాగా, ఇప్పటికే 80 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అందులో టీఆర్ఎస్ 77 వార్డులకు.. ఎంఐఎం పార్టీ 3 వార్డులు సొంతం చేసుకున్నాయి.

మరోవైపు హుజూర్‌నగర్ మున్సిపాలిటీలో ఒక వార్డు టీఆర్ఎస్ కైవసం చేసుకోగా.. ఆదిబట్లలో మూడు వార్డులను కాంగ్రెస్‌ సొంతం చేసుకుంది. కాగా, ఇల్లందులో ఉద్రిక్తత నెలకొంది. బ్యాలెట్ బాక్స్‌లకు సీల్ వేయలేదని పలు పార్టీలు ఆందోళనకు దిగాయి. ఇక వారిని అధికారులు సర్ది చెబుతున్నారు.