వొడాఫోన్‌కు గట్టి షాక్.. ఆథరైజేషన్‌ సర్టిఫికెట్‌ను రద్దు చేసిన ఆర్బీఐ!

ప్రముఖ టెలికాం రంగ సంస్థ వొడాఫోన్‌కు రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా(ఆర్బీఐ) ఝలక్ ఇచ్చింది. సంస్థ స్వచ్ఛంధంగా ఆథరైజేషన్‌ సర్టిఫికెట్‌ను తిరిగి ఇచ్చేయడంతో ఆర్బీఐ వొడాఫోన్ ఎం-పేసా సర్టిఫికెట్ ఆఫ్ ఆథరైజేషన్‌ను రద్దు చేస్తున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇక తాజా నిర్ణయంతో వొడాఫోన్ తన కస్టమర్లకు ఇకపై ఈ పేమెంట్ సేవలను అందించలేదు. ఇప్పుడు ఈ సర్వీసులను నిలిపివేయడంతో అటు కస్టమర్లకు, ఇటు మర్చంట్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఒకవేళ వ్యాలెట్లలో […]

వొడాఫోన్‌కు గట్టి షాక్.. ఆథరైజేషన్‌ సర్టిఫికెట్‌ను రద్దు చేసిన ఆర్బీఐ!

Updated on: Jan 22, 2020 | 12:38 PM

ప్రముఖ టెలికాం రంగ సంస్థ వొడాఫోన్‌కు రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా(ఆర్బీఐ) ఝలక్ ఇచ్చింది. సంస్థ స్వచ్ఛంధంగా ఆథరైజేషన్‌ సర్టిఫికెట్‌ను తిరిగి ఇచ్చేయడంతో ఆర్బీఐ వొడాఫోన్ ఎం-పేసా సర్టిఫికెట్ ఆఫ్ ఆథరైజేషన్‌ను రద్దు చేస్తున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇక తాజా నిర్ణయంతో వొడాఫోన్ తన కస్టమర్లకు ఇకపై ఈ పేమెంట్ సేవలను అందించలేదు.

ఇప్పుడు ఈ సర్వీసులను నిలిపివేయడంతో అటు కస్టమర్లకు, ఇటు మర్చంట్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఒకవేళ వ్యాలెట్లలో క్లెయిమ్ ఉండిపోతే సెటిల్‌మెంట్ కోసం కంపెనీని సంప్రదించి మూడేళ్ళ లోగా ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చునని తెలిపింది.

ఇకపోతే ఈ సేవలను ఆపేయడానికి వొడాఫోన్, ఐడియా కంపెనీలు విలీనం కావడం ఓ కారణం అయితే.. ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే లాంటి మనీ ట్రాన్సఫరింగ్ యాప్‌లకు ఇది పోటీ ఇవ్వలేకపోవడం మరో కారణం. ఆన్లైన్ పేమెంట్ సిస్టం ఆపరేటర్‌గా పని చేసిన వొడాఫోన్ ఎం-పేసాను కస్టమర్లు మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం కోసం ఉపయోగించేవారు. కాగా, 2015లో రిజర్వు బ్యాంక్ 11 సంస్థలకు పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సులు ఇచ్చింది. ఇక అందులో వొడాఫోన్ ఎం-పేసా కూడా ఉన్న విషయం విదితమే.