పృథ్వీ షాకు వన్డేల్లో చోటు దక్కుతుంది.. మరి శాంసన్‌కు.?

|

Jan 22, 2020 | 2:03 PM

ఆస్ట్రేలియాతో సిరీస్‌ ముగిసింది. ఈ నెల 24వ తేదీ నుంచి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 సిరీస్ మొదలు కానుంది. ఇదిలా ఉంటే ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో ఓపెనర్ శిఖర్ ధావన్‌కు గాయమైన సంగతి తెలిసిందే. దానితో కివీస్ టూర్‌కి అతను అందుబాటులో లేదు. ఇక ధావన్ స్థానంలో యువ క్రికెటర్లు సంజూ శాంసన్‌, పృథ్వీ షాలను బీసీసీఐ ఎంపిక చేసింది. ప్రస్తుతం పృథ్వీ షా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ‘న్యూజిలాండ్ ఏ’తో జరుగుతున్న సిరీస్‌లో […]

పృథ్వీ షాకు వన్డేల్లో చోటు దక్కుతుంది.. మరి శాంసన్‌కు.?
Follow us on

ఆస్ట్రేలియాతో సిరీస్‌ ముగిసింది. ఈ నెల 24వ తేదీ నుంచి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 సిరీస్ మొదలు కానుంది. ఇదిలా ఉంటే ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో ఓపెనర్ శిఖర్ ధావన్‌కు గాయమైన సంగతి తెలిసిందే. దానితో కివీస్ టూర్‌కి అతను అందుబాటులో లేదు. ఇక ధావన్ స్థానంలో యువ క్రికెటర్లు సంజూ శాంసన్‌, పృథ్వీ షాలను బీసీసీఐ ఎంపిక చేసింది.

ప్రస్తుతం పృథ్వీ షా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ‘న్యూజిలాండ్ ఏ’తో జరుగుతున్న సిరీస్‌లో అదరగొట్టే ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. అటు కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్‌‌లో అద్భుతంగా రాణిస్తుండగా కివీస్‌తో జరగబోయే వన్డేలకు షాను ఓపెనర్‌గా తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. గత ఏడాది నవంబర్‌లో నిషేదానికి గురైన షా.. రీ-ఎంట్రీలో అదరగొట్టాలని ఉవ్విళ్లూరుతున్నాడు.

ఇకపోతే టీ20ల్లో శాంసన్‌కు మరో అవకాశం దక్కింది. గతంలో శ్రీలంకతో సిరీస్‌కు ఎంపికైనా అతడి సరైన అవకాశాలు రాలేదు. ఇక వచ్చిన ఒక్క ఛాన్స్‌ను కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అయితే ఇప్పుడు కేఎల్ రాహుల్ జట్టులో ఉండటం.. అంతేకాకుండా రిషబ్ పంత్‌ను అన్ని ఫార్మాట్లలోనూ అవకాశాలు వస్తుండటంతో.. కోహ్లీ ఈసారి కూడా శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ కనిపించట్లేదు. కాగా, న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ వచ్చే నెల 5వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

వన్డే జట్టు: విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌శర్మ, పృథ్వీషా, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), శివమ్‌దూబె, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌, రవీంద్ర జడేజా, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి, నవ్‌దీప్‌ సైని, శార్దూల్‌ ఠాకుర్‌, కేదార్‌ జాదవ్‌

టీ20 జట్టు: విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌శర్మ, సంజూ శాంసన్, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), శివమ్‌దూబె, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి, నవ్‌దీప్‌ సైని, శార్దూల్‌ ఠాకుర్‌, రవీంద్ర జడేజా