Latest Health Tips: ఈ కాలంలో ప్రతీ ఒక్కరూ కూడా అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. అంతేకాదు అబ్బాయిలు అయితే మాత్రం అందంగా, సిక్స్ ప్యాక్ యాబ్స్ తో చూడడానికి ఆకర్షణగా ఉండాలని అనుకుంటారు. ఇది ఇలా ఉంటే ఉద్యోగ ఒత్తిడి, ప్రయాణాలు తదితర విషయాలు ద్వారా అబ్బాయిల అందరికి పొట్ట రావడం సహజం అయిపొయింది. వాళ్ళు ఎన్ని వ్యాయామాలు చేసినా కూడా అది తగ్గట్లేదు. ఏది ఏమైనా ఏదో ఒకటి చేసి అది తగ్గించుకోవాలని చాలా కష్టాలు పడుతున్నారు యువకులు. అలా తగ్గించుకోవాలని అనుకుంటున్నవారికి ఈ ఆర్టికల్ ఎంతో ఉపయోగం. మన పొట్టను తగ్గించుకోవడానికి పలు మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి మనం తింటున్న ఆహరం. మనం రోజూ తినే ఆహారంలోనే కొన్ని మార్పులు చేసుకుంటే ఈజీగా పొట్టను తగ్గించుకోవచ్చు. పొట్ట రాకుండా ఉండడానికి మానుకోవాల్సి ఆహార పదార్ధాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
1.ఫాస్ట్ ఫుడ్:
సిక్స్ ప్యాక్ యాబ్స్ రాకుండా మిమ్మల్ని దూరం చేసే మొదటి ఆహారం ఈ ఫాస్ట్ ఫుడ్. ఈ ఫాస్ట్ ఫుడ్ అనే మాట వింటే చాలు మీకు నోరూరిపోతుందని.. కానీ మనకు ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. దీనికి మీరు దూరంగా ఉంటే మీరు ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటారని చెప్పగలను. అంతేకాదు ఫాస్ట్ ఫుడ్ కి ఊబకాయానికి అవినాభావ సంబంధం ఉందని అందరికి తెలిసిన విషయమే.
2. షుగర్ (పంచదార):
పంచదార తింటే ఊబకాయం రావడం ఏంటని అనుకుంటున్నారా. ఖచ్చితంగా లింక్ ఉండండి. మీరు చదివే ప్రతీ ఆర్టికల్ లో ఆరోగ్యం బాగుండాలంటే షుగర్ తగ్గించండి అని ఉంటుంది. ఎందుకో తెలుసా.. తీపిగా ఉండే ఈ పదార్ధం మన శరీరానికి ఎంతో హాని కలిగిస్తుంది. కప్పుడు పంచదారలో ఏకంగా 773 క్యాలోరీస్ ఉంటాయి. మరోవైపు దీని వల్ల ఊబకాయం, మధుమేహం వంటి రోగాలు కూడా వస్తాయి.
3. బంగాళాదుంపలు:
అందరికి ఎక్కువగా నచ్చే పదార్ధం ఈ బంగాళదుంప. ఫ్రైస్ గానీ, ఉడకపెట్టిన బంగాళాదుంప గానీ.. లేదా ఏదైనా కూడా ఇష్టంగా తింటారు. కానీ కొన్నిసార్లు మనకి నచ్చిన ఆహార పదార్థమే మనకి హాని చేస్తుందని తెలుసుకోవాలి. ఒక బంగాళాదుంప లో కనీసం 163 క్యాలోరీస్ ఉంటాయి. ఈ ఆహార పదార్ధం తో మీరు సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేస్తే అది నిజంగా కష్టతరమే.
4. మయోన్నైస్:
గుడ్డ సోనలతో తయారు చేసే పదార్ధాన్ని మయోన్నైస్ అని అంటారు. ఫ్రైస్, శాండ్విచ్, ఫాస్ట్ ఫుడ్ ను మీరు యాబ్స్ కోసం ఎలా త్యాగం చేస్తారో.. అలాగే దీనిని కూడా మీరు త్యాగం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే దీనిలో 80% కొవ్వు ఉంటుంది. ఇది మీ డైట్ లో లేకుండా ఉండేలా చూసుకోండి.
5. శీతల పానీయాలు:
ఫాస్ట్ ఫుడ్ తో పాటు ఒక కూల్ డ్రింక్ తాగితే ఆ మజానే వేరు. కూల్ డ్రింక్స్ లేకుండా ఫాస్ట్ ఫుడ్ ని అసలు ఊహించలేం. కానీ మీకు యాబ్స్ కావాలంటే మాత్రం వీటికి పూర్తిగా దూరంగా ఉండాలి. 12 ఔన్స్ డ్రింక్ లో దాదాపు 140 క్యాలోరీస్ ఉంటాయి. ఇలా ఇంకా కొన్ని ఆహార పదార్ధాలను మీరు దూరం పెడితే.. మీకు పొట్ట రాకుండా అడ్డుకోవచ్చు.